Kishan Reddy : ప్రజల ధనాన్ని దోచుకున్న వాళ్ళను.. అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలి.!

బీరు, బ్రాందీ వ్యాప్యారం చేసి..ప్రజల ధనాన్ని దోచుకున్న వాళ్లను అరెస్టు చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును కేసీఆర్ బ్లాక్ డేగా ప్రకటించడం గురివింద గింజ సమేత వలే ఉందంటూ ఎద్దేవా చేశారు.

New Update
Kishan Reddy : ప్రజల ధనాన్ని దోచుకున్న వాళ్ళను.. అరెస్ట్ చేస్తే  కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలి.!

Kishan Reddy v/s KCR : బీరు, బ్రాందీ వ్యాప్యారం చేసి.. ప్రజల ధనాన్ని దోచుకున్న వాళ్లను అరెస్టు చేస్తే అది కక్ష సాధింపు  ఎలా అవుతుందో బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్ చెప్పాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy). ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Aravind Kejriwal) అరెస్టును కేసీఆర్ బ్లాక్ డే(Black Day) గా ప్రకటించడం గురివింద గింజ సమేత వలే ఉందంటూ ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కాంలో ఢిల్లీలో తీగ లాగితే కవిత డొంక కదిలిందన్నారు. లిక్కర్ వ్యవహారంలో ఢిల్లీ అధికారుల ఫిర్యాదు మేరకే..లిక్కర్ కుంభకోణంలపై దర్యాప్తు జరిగిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

సీఎం అయితే అరెస్టు చేయోద్దా? 

ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని లిక్కర్ పాలసీ(Liquor Policy) అమలు చేశారని ఈడీ(ED) వెల్లడించినట్లు తెలిపారు. అరెస్టులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మమత వంటి వాళ్లును బీజేపీని విమర్శిస్తున్నారని..సీఎం అయినంత మాత్రాన వారు చేసిన అవినీతిని, కుంభకోణాలను వదిలిపెట్టాలా అని ప్రశ్నించారు. వదిలిపెట్టాలని కేసీఆర్ చెప్తారా?అసలు ఎందుకు బ్లాక్ డేగా ప్రకటించారు?అవినీతి పరులు సీఎం కావడమే బ్లాక్ డే అన్నారు కిషన్ రెడ్డి. సీఎంలు వారసులను అడ్డు పెట్టుకుని ప్రజాధనాన్ని దోచుకోవడం బ్లాక్ డే అన్నారు. కేసీఆర్...తన సొంత కూతురును అరెస్టు చేస్తే స్పందించలేదు కానీ కేజ్రీవాల్ ను అరెస్టు చేస్తే ఎందుకు స్పందించారని ప్రశ్నించారు. కవిత అరెస్టుపై మాట్లాడకుండా కేజ్రీవాల్ అరెస్టుపై ఎందుకు మాట్లాడారో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ హయాంలో మద్యం ఏరులై పారింది: 

కేసీఆర్(KCR) హయాంలో మద్యాన్ని ఏరులై పారించారన్న కిషన్ రెడ్డి..బెల్ట్ షాపులు తొలగిస్తామని కాంగ్రెస్ తెలిపిందన్నారు. కానీ ఎక్కడా అది ముందుకు కదల్లేదన్నారు. కాంగ్రెస్ వైన్స్ లను ఓపెన్ బార్లుగా మార్చిందని ఆరోపించారు. మహిళలు అక్కడ తిరగాలంటనే ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ సర్కార్ మద్యం వ్యాపారులకు రాహుల్ గాంధీ టాక్స్ వేస్తున్నారన్నారు. గతంలో ఇక్కడి లిక్కర్ బిజినెస్ మోడల్ ను ఢిల్లీకి బదిలీచేశారని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో దోచుకున్నట్లే ఢిల్లీలోనూ దోచుకునే ప్రయత్నం చేశారన్న కేంద్రమంత్రి...అవినీతి చిట్ట బయటపడటంతో బీజేపీని విమర్శిస్తున్నారన్నారు. కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత(Kavitha) పాత్ర ఎందుకు ఉందని ప్రశ్నించారు.

దర్యాప్తు సంస్థల నోటీసులకు జవాబు ఇవ్వకుండా తప్పించుకున్నారు: 

దర్యాప్తు సంస్థల నోటీసులకు జవాబు ఇవ్వకుండా కేజ్రీవాల్ తప్పించుకుని తిరిగారు.. కేజ్రీవాల్ దీని మీద డొంక తిరుగులు తిరుగుతూ సానుభూతి పొందే ప్రయత్నాలు చేశారన్నారు. ఈ కుంభకోణంలో ఆరోపణలు కాదు..సాక్ష్యాలు ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ కుటుంబానికి ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ఆప్ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధం లేదని కేసీఆర్ చెబుతారా? ఢిల్లీ లిక్కర్ స్కాంలో వందల కోట్లు చేతులు మారినట్లు సాక్ష్యాలతో నేను నిరూపిస్తా..మీరు నిరూపించగలరా అంటూ సవాల్ విసిరారు.

ఇది కూడా చదవండి: మా నాన్న కోరిక మేరకే నాకు టికెట్.. ఖచ్చితంగా గెలుస్తా: ఆర్టీవీతో కృపాలక్ష్మి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు