Ayodhya Rammandhir: కుహానా సెక్యులర్‌లు రామమందిరాన్ని వ్యతిరేకిస్తున్నారు.. కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్‌..

500 సంవత్సరాల పోరాట ఫలితమే రామ మందిర నిర్మాణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలు శాంతిగా ఉండటం కొన్ని పార్టీలకు నచ్చడం లేదని.. కుహానా సెక్యులర్ వాదులు రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారంటూ విమర్శించారు.

Kishan Reddy: అందుకే పోలింగ్ శాతం తగ్గింది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
New Update

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జనవరి 22న రామాలయం ప్రారంభోత్సవం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ' 500 సంవత్సరాల పోరాట ఫలితమే రామ మందిర నిర్మాణం. బాబర్ దురాక్రమణలతో అయోధ్యలో ఉన్న రామమందిరాన్ని ధ్వంసం చేసి, బాబర్ జ్ఞాపకార్థం కోసం బాబ్రీ మసీదును నిర్మించారు. అయోధ్య రామమందిర నిర్మాణం కోసం 1990లో అద్వానీ రథయాత్ర చేపట్టారు.

నాటి నుంచి నేటి వరకు రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ పోరాటం చేస్తోంది. ప్రజలు శాంతిగా ఉండటం కొన్ని పార్టీలకు నచ్చడం లేదు. కుహానా సెక్యులర్ వాదులు రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు. దేశంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతోంది. పార్లమెంట్ స్థానాలను తిరిగి గెలుచుకునే పరిస్థితులు కాంగ్రెస్‌లో లేవు.

Also Read: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. ఎప్పుడంటే?

మరోసారి మోదీ.. ప్రధాని కావాలని దేశ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఒక్క అవినీతి మచ్చ లేకుండా నీతివంతంగా పరిపాలన అందించిన ఘనత మోదీది. ఒక్క రోజు సెలవు లేకుండా ఆయన నిరంతరం దేశం కోసం పని చేశారు. కేసీఆర్ మాత్రం నెలలో 25 రోజులు సచివాలయం రాకుండా ఫామ్ హౌస్‌లో ఉండేవారు. రాహుల్ గాంధీ ఏడాదిలో రెండు నెలలు విదేశాల్లో విహారం చేస్తారు బీచ్‌లలో నిక్కర్‌లు వేసుకునే తిరుగుతారు.

బీజేపీని, మోదీని తట్టుకోలేక అధ్యక్ష పదవికి రాజీనామ చేసి విదేశాలకు పారిపోయిన రాహుల్ గాంధీ ఇవాళ ప్రధాని అవుతాడా ?. తెలుగు ప్రజలకు ఇవాళ సంక్రాంతి అయితే మోదీ మూడోసారి ప్రధాని అయిన రోజే దేశ వ్యాప్త సంక్రాంతి పండుగ. 370 రద్దు చేసి ఉగ్రవాదులను తరిమి కొట్టాం. పాకిస్థాన్‌లో ముద్రిస్తున్న ఇండియన్ నకిలీ కరెన్సీని అరికట్టడానికి పెద్ద ఓట్లను రద్దు చేశాం. బీజేపీ అధికారంలో ఉంది కాబట్టే ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశామని' కిషన్‌ రెడ్డి అన్నారు.

Also Read: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

#telugu-news #national-news #bjp-kishan-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe