Sarpanch Elections: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. ఎప్పుడంటే? తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలపై ఇంకా క్లారిటీ రాలేదు. తమ పదవీకాలాన్ని పొడిగించాలని సర్పంచులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల తరువాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సర్పంచుల పదవీకాలం FEB 1తో ముగియనుంది. By V.J Reddy 14 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Sarpanch Elections: తెలంగాణలో మరికొన్ని నెలల్లో మరోసారి ఎన్నికలు జరగనున్నాయి. అవును మీరు విన్నది నిజమే!, మరి కొన్ని నెలల్లో తెలంగాణలో మూడు ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, అలాగే పంచాయతీ ఎన్నికలు. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నెల 29న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. పార్లమెంట్ ఎన్నికలపై ఇంకా నోటిఫికేషన్ రాలేదు. లోక్ సభ ఎన్నికలకు (Lok Sabha Elections) ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అన్ని పార్టీలు ఎంపీ ఎన్నికలపై కసరత్తు ప్రారంభించాయి. ALSO READ: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు పంచాయితీ ఎన్నికలు..? తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఇంకా స్పష్టత రాలేదు. ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకుస్పందించలేదు. ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచ్, ఉపసర్పంచుల పదవీకాలం ముగుస్తుంది. వాస్తవానికి ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావాలి. షెడ్యూల్ రాకపోవడంతో ప్రత్యేక అధికారులకు భాద్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పంచాయతీ రాజ్ శాఖ జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పదవి కాలం పొడిగించండి.. తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని (Congress Govt) సర్పంచులు రిక్వెస్ట్ చేస్తున్నారట. గత ప్రభుత్వం లో ఉన్న పెండింగ్ బిల్లులు ఇంకా రాలేదని.. అందుకోసం తమ పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతున్నారట. వారి అభ్యర్థనలు విన్న రేవంత్ (CM Revanth Reddy) సర్కార్ వారి పదవి కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎన్ని నెలలు పొడిగించాలనే దానిపై నేతలతో అంతర్గత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల తరువాతే పంచాయతీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్ సభ షెడ్యూల్ విడుదల కానుంది. తెలంగాణలో ఒకేసారి జడ్పిటీసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ALSO READ: Rythu Bandhu : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బంధుకు లైన్ క్లియర్! #mp-elections #cm-revanth-reddy #telangana-latest-news #congress-party #sarpanch-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి