Telangana: కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనానికి ఒప్పందం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిశారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ వీలీనం చేసేందుకు ఢిల్లీలో ఒప్పందం జరిగినట్లు ఆరోపించారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని మండిపడ్డారు.

New Update
Telangana: కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనానికి ఒప్పందం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కలిశారని అన్నారు. కేసీఆర్‌ చెప్పిందే కాంగ్రెస్‌ చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ వీలీనం చేసేందుకు ఢిల్లీలో ఒప్పందం జరిగిందని ఆరోపించారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: పనికి వస్తావనుకుంటే పరువు తీస్తావా?.. దానంపై రేవంత్ ఫైర్!

ఇదిలాఉండగా.. ఇటీవల సీఎం రేవంత్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ నేతలు రేవంత్‌కు కౌంటర్లు వేసారు. అలా విలీనం జరిగే ప్రసక్తే ఉండదని.. కాంగ్రెస్‌లోనే బీఆర్‌ఎస్ విలీనం అవుతుందంటూ ఎదురు దాడులు చేశారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ విలీనం అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతుంది. కొందరు బీఆర్ఎస్‌ ఏ పార్టీలో కూడా విలీనం కాదని వాదిస్తుంటే.. మరికొందరేమే రాజకీయాల్లో ఏమైనా జరగచ్చొని చెబుతున్నారు.

Also read: జన్వాడ ఫాంహౌస్ కూల్చివేత.. హైడ్రాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

Advertisment
Advertisment
తాజా కథనాలు