Parliament Sessions: రాహుల్‌ గాంధీకి సారీ చెప్పిన అనురాగ్ ఠాకూర్.. ఎందుకంటే

తమ కులం ఏంటో తెలియని వాళ్లు కులగణన చేయాలంటున్నారని లోక్‌సభ సమావేశాల్లో మాజీ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాహుల్‌ గాంధీని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటూ విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో ఆయన రాహుల్‌కు క్షమాపణలు చెప్పారు.

New Update
Parliament Sessions: రాహుల్‌ గాంధీకి సారీ చెప్పిన అనురాగ్ ఠాకూర్.. ఎందుకంటే

లోక్‌సభ సమావేశాల్లో మాజీ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తమ కులం ఏంటో తెలియని వాళ్లు కులగణన చేయాలని అడుగుతున్నారని అన్నారు. విపక్ష నేత రాహుల్‌ గాంధీని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటూ విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దీంతో సభలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల మంటలు రాజుకున్నాయి. అనురాగ్ ఠాకూర్ పదజాలంపై విపక్ష సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో చివరికి చేసేదేమి లేక.. అనురాగ్‌ ఠాకూర్‌ రాహుల్‌ గాంధీకి క్షమాపణ చెప్పారు. దీనిపై స్పందించిన స్పందించిన రాహుల్.. నీ క్షమాపణ నాకు అవసరం లేదని చెప్పారు.

Also Read: ఫాస్టాగ్ ప్లేస్‌లో శాటిలైట్ టోల్.. రోడ్ ఎక్కితే చాలు డబ్బులు కట్టాల్సిందే!

Advertisment
తాజా కథనాలు