Union Budget 2024: అమరావతికి మళ్లీ మంచి రోజులొచ్చాయి.. రూ.15వేల కోట్లు కేటాయింపుపై చంద్రబాబు!

ఏపీ రాజధాని నిర్మాణంకోసం కేంద్రం రూ.15వేల కోట్లు కేటాయించడంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. అమరావతికి మళ్లీ మంచిరోజులు వచ్చాయన్నారు. 2024 బడ్జెట్‌లో పోలవరం నిర్మాణంపై నిర్ధిష్టమైన హామీ ఇచ్చినందుకు నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

New Update
Union Budget 2024: అమరావతికి మళ్లీ మంచి రోజులొచ్చాయి.. రూ.15వేల కోట్లు కేటాయింపుపై చంద్రబాబు!

CM Chandrababu: కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని (AP Capital) నిర్మాణంకోసం బడ్జెట్‌లో రూ.15వేల కోట్లు కేటాయించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అమరావతికి (Amaravati) మళ్లీ మంచిరోజులు వచ్చాయనే ఆశ అందరిలో చిగురించిందన్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణం జరిగుంటే మరో మూడు లక్షల కోట్ల రూపాయల ప్రజా సంపద కూడా వచ్చి ఉండేదని చెప్పారు. గత పాలకుల వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక ఏపీ జీవనాడి పోలవరం 72శాతం పూర్తయింది. పోలవరాన్ని సాధ్యమైనంత తొందరలోనే పూర్తి చేస్తామని బడ్జెట్‌లో (Union Budget 2024) ఆర్థిక మంత్రి నిర్ధిష్టమైన హామీ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. 2020-21 నాటికి పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని, కావాలని కాంట్రాక్టర్లను, అధికారులను మారుస్తూ అంతా పాడు చేశారంటూ మండిపడ్డారు.

నిర్మల సీతారామన్ భరోసా..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, రైతులకు జీవనాడి పోలవరం. భారత ఆహార భద్రతకు ఆ ప్రాజెక్టు ఎంతో కీలకం. పోలవరం నిర్మాణం (Polavaram Project) వెంటనే జరిగేలా చర్యలు తీసుకుంటామని నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) భరోసానిచ్చారు. అలాగే ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు తెలిపారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం చేస్తామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్‌, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. విశాఖ - చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Gas Geyser : మీరు గ్యాస్ గీజర్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి!

రైతులు, మహిళల ఆనందం..
ఇక కేంద్ర బడ్జెట్ లో రాజదాని అమరావతికి నిధులు‌కేటాయించడంపై రైతులు, మహిళల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. బడ్జెట్‌లో అమరావతి, పోలవరంకు ప్రాధాన్యత ఇవ్వడం, నిధులు కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి ఊపిరిపీల్చుకుందని, ఐదేళ్లు జగన్ సర్కారు అమరావతిని నిర్లక్ష్యం చేసిందన్నారు. చంద్రబాబు చెప్పినట్లు అమరావతి, పోలవరంకు నిధులు వచ్చేలా చేశారు. ఇక అమరావతిని ఎవరూ ఆపలేరు. అమరావతితో పాటు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలనేది మా ఆకాంక్ష. జగన్ కు ఏపీ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందంటున్నారు.

హు కిల్డ్‌ బాబాయ్‌..
హూకిల్డ్ బాబాయ్..? అనే ప్రశ్నకు త్వరలోనే జవాబు వస్తుందన్నారు చంద్రబాబు. వివేకా హత్య కేసులో నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే.. పోలీసులు నేరస్తులకు సహకరిస్తే ఎలా ఉంటుందో గత ఐదేళ్లల్లో చూశామన్నారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్లిన సీబీఐ ఖాళీ చేతులతో తిరిగి వచ్చిందని గుర్తు చేశారు. వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగింది. హత్య జరిగాక ఘటనాస్థలికి సీఐ వెళ్లారు. సీబీఐకి విషయం తెలపడానికి ఆయన సిద్ధపడ్డారు. కానీ, ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి సీఐకి పదోన్నతి ఇచ్చింది. విచారణాధికారిపై కేసు పెడితే హైకోర్టుకు వెళ్లి బెయిల్‌ తీసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే రావణ కాష్టమే అంటూ హెచ్చిరించారు.
తప్పు చేసిన వ్యక్తులను వదిలేదే లేదని, ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పు అన్నారు. ముఠాలు, కలహాలను కలహాలు కంట్రోల్ చేశాం. రాజకీయ నేతలే రౌడీలైతే రాజకీయాలు నేరమయం అవుతాయి. కొందరు కోడికత్తి, గులకరాయి డ్రామాలు ఆడారు. కోడికత్తి డ్రామా ఫలించింది.. కానీ గులకరాయి ఫలించ లేదంటూ మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.

Advertisment
తాజా కథనాలు