National: నది కింద మెట్రో..భారత్ మరో అద్భుతం..నేడే ప్రారంభం

భారత రైల్వే చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమవ్వనుంది. నది కింద మెట్రో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సర్వీసులను ప్రారంభించనున్నారు.

New Update
National: నది కింద మెట్రో..భారత్ మరో అద్భుతం..నేడే ప్రారంభం

UNder Water Metro Rail Service: భారతదేశంలో రైల్వే రవాణా పరుగులు తీస్తోంది. స్పీడ్ ట్రైన్స్, వందే భారత్, బుల్లెట్ ట్రైన్స్...వీటిని దాటి ఇప్పుడు ఏకంగా అండర్ వాటర్ రైలు సర్వీసులు దిశగా అడుగులు వేస్తోంది. దేశంలోనే మొట్టమొదటి నీటి అడుగున మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈరోజు ప్రధాని మోదీ చేతులు మీదుగా ఈ అద్భుతం ఆవిష్కృతమవ్వనుంది. కోలకత్తాలోని హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగ మార్గంలో ఈ మెట్రో సేవలు అందబాటులోకి రానున్నాయి.

నది కింద మెట్రో ట్రైన్ ప్రత్యేకతలివే...

హగ్లీ నది కింద మెట్రో రైలు మార్గం హవ్‌డా మైదాన్- ఎస్‌ప్లనేడ్‌లను కలుపుతూ 4.8 కి.మీల వరకు నిర్మించారు. మొత్తం మూడు స్టేషన్లు ఉన్నాయి. హవ్‌డా మైదాన్, హవ్‌డా స్టేషన్ కాంప్లెక్స్, బీబీడీ బాగ్ స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది.

హవ్‌డా మైదాన్, ఎస్‌ప్లనేడ్ సెక్షన్ దేశంలోనే నిర్మితమైన అతి పెద్ద టన్నెల్. హవ్‌డా మెట్రో స్టేషన్ భారతదేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్.

ఈ మెట్రో రైలు నీటి అడుగున 16 మీటర్ల దిగువన నడవనుంది. ఈ ప్రయాణం అద్భుతంగా ఉంటుందని...ఈ మార్గంలో రోజుకు దాదాపు 7 లక్షల మంది ప్రయాణిస్తారని అధికారులు చెబుతున్నారు. రేపు ప్రధాని మోదీ ఈ సర్వీసులను ప్రారంభించాక..మార్చి 7 నుంచి అంటే ఎల్లుండి నుంచి ప్రయాణికులను అనుమతిస్తామని చెబుతున్నారు.

ఈ నీటి అడుగు మెట్రో రైతులతో కోలకత్తా మరో సరికొత్త రికార్డును తనఖాతాలో వేసుకోనుంది. దేశంలో మొదటిసారి 1984లో మెట్రో సేవలు ఇక్కడ నుంచే ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు నీటి అడుగు మెట్రో సర్వీసులుకూడా ఇక్కడ నుంచే ప్రారంభం అవుతున్నాయి.

ఈ మెట్రో కారిడార్ కోసం 120 కోట్లు ఖర్చు పెట్టారు. 520 మీటర్ల పొడవున్న దీన్ని 45 సెకెన్లలో మెట్రో రైలు దాటుతుంది. కోల్‌కత్తా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ మొత్తం 16.6 కిలోమీటర్లు ఉండగా ఇందులో 10.8 కి.మీలు నీటి అడుగున ఉంటాయి.

ఈ కొత్త ప్రాజెక్టు వలన రైలు రవాణాలో కొత్త విప్లవం రావడమే కాకుండా నగరంలో ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అంతేకాదు వాయు కాలుష్యం కూడా చాలా నియంత్రించబడుతుంది.

నీటి అడుగున నిర్మించిన ఈ టన్నెల్ జంట నగరాలైన కోలకత్తా, హావ్‌డాలను కలుపుతుంది. మొత్తం ఆరు మెట్రో స్టేషన్‌లో ప్రయాణించే ఈ రైలు...నీటి అడుగున మూడు స్టేషన్‌లో ఆగుతుంది.

ఈ అండర్ వాటర్ మెట్రో సర్వీసులను మరింత విస్తరించాలని కోలకత్తా మెట్రో లక్ష్యంగా పెట్టుకుంది. సాల్ట్ లేక్ సెక్టార్ vs హావ్‌డా మైదాన్ మధ్య కార్యకలాపాలను ప్రారంభించాలని అనుకుంటోంది. ప్రస్తుతం 4.8 కి.మీ ఉన్న ఈ రైలు మార్గాన్ని రెండో భాగంలో మరింత పొడిగించాలని భావిస్తున్నారు.

ఈ మొత్తం అండర్ వాటర్ ప్రాజెక్టుకు ఫిబ్రవరి 2009లో పునాది పడింది. మార్గం నిర్మాణం 2017లో ప్రారంభించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు