Kotta Prabhakar Reddy:ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు.  ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలు కాగా ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

New Update
Kotta Prabhakar Reddy:ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి

ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరుఫున దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఈరోజు దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ప్రభాకర్ రెడ్డి మీద ఓ దుండగుడు కత్తితో దాడి చేయగా...  కడుపులో గాయం అయ్యింది.  దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే దాడి చేసిన వ్యక్తిని బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే పట్టుకుని చితక్కొట్టి మరీ పోలీసులకు అప్పగించారు. నిందితుడు మిరుదొడ్డి మండలం చెప్పాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే దాడి ఎందుకు చేశాడు అనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు.

Also Read:13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్

కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి సంగతి తెలియగానే మంత్రి హరీష్ రావు ఆయనను ఫోన్ లో పరామర్శించారు. తర్వాత హుటాహుటిన మెదక్ బయలుదేరారు కూడా. అవసరం అయితే ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్‌కు తీసుకురావాలని హరీష్ రావు బీఆర్ఎస్ నేతలకు సూచించారు.

Advertisment
తాజా కథనాలు