Zelensky : అలా జరిగితే మూడో ప్రపంచ యుద్ధమే.. జెలెన్‌స్కీ హెచ్చరిక రష్యాతో ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదముందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు. అమెరికాతో పాటు అనేక దేశాలు తమకు మద్దతుదా నిలుస్తున్నాయని.. నాటో కూటమిలో సభ్య దేశంపై రష్యా దాడి చేస్తే.. అది మరో ప్రపంచ యుద్ధానికి నాందిగా భావించాల్సి ఉంటుందని అన్నారు. By B Aravind 29 Jan 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి 3rd World War : 2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా - ఉక్రెయిన్(Russia - Ukraine) యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. ఇటీవలే ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతంలో రష్యా సైనిక విమానం కుప్పకూలడంతో అందులో ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు, సిబ్బందితో సహా మొత్తం 75 మంది మృతి చెందారు. ఉక్రెయిన్ బలగాలే ఈ దాడి చేశాయని రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) ఆరోపణలు చేశారు. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) సంచలన ఆరోపణలు చేశారు. రష్యాతో ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదముందని హెచ్చరించారు. మరో ప్రపంచ యుద్ధమే అమెరికా(America) తో పాటు అనేక దేశాలు తమకు మద్దతుదా నిలుస్తున్నాయని.. దీంతో ఏమైనా జరగొచ్చని వ్యాఖ్యానించారు. ఈ విషయం జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్‌కు కూడా తెలుసని చెప్పారు. ఒకవేళ నాటో కూటమిలో ఉన్న సభ్య దేశంపై రష్యా దాడి చేస్తే.. అది మరో ప్రపంచ యుద్ధానికి నాందిగా భావించాల్సి ఉంటుందంటూ అన్నారు. ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్న జెలెన్స్‌స్కీ ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే బెర్లిన్ నుంచి టారస్ క్రూజ్ క్షిపణులు అందకపోవడంపై తాను నిరాశ చెందడం లేదని తెలిపారు. Also Read : మోనాలిసా చిత్రం మీద సూప్… నిరసన నిధులు సమీకరించాలి రష్యాతో చేసే యుద్ధం విషయంలో ఐరోపా దేశాలకు ఉన్న బలహీనతలను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. అలాగే ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా సిద్ధమైనప్పుడు జర్మనీ(Germany) తన వంతు పాత్ర పోషించలేదన్నారు. ఇప్పుడు జర్మనీ ఉక్రెయిన్ కోసం ఐరోపా దేశాలతో కలిసి పెద్ద ఎత్తున నిధులు సమీకరించే ప్రయత్నం చేయాలని కోరారు. ఇలా చేస్తే ప్రతికూల సంకేతం మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే.. ఆయన ఉక్రెయిన్‌కు మద్దతిస్తారా అని జెలెన్‌స్కీని విలేకర్లు అడగగా.. అమెరికా విధానం ఒక వ్యక్తిపై ఆధారపడి ఉండదని చెప్పారు. అలాగే ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థిక సాయం తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రష్యాతో జరుగుతున్న పోరాట సమయంలో ఇలాంటివి చేస్తే ప్రతికూల సంకేతాలు పంపుతాయని వివరణ ఇచ్చారు. Also Read: గాల్లో ఉండగానే ముక్కలై కుప్పకూలిన విమానం.. ఏడుగురు మృతి #telugu-news #zelensky #russia-ukraine-war #3rd-world-war మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి