BREAKING : అణ్వాయుధాలను ప్రయోగిస్తాం.. పుతిన్‌ సంచలన ప్రకటన!

రష్యా-యుక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమై రెండేళ్లు దాటినా ఇప్పటివరకు జెలన్‌స్కీ సేనలపై పుతిన్‌ సైన్యం పైచేయి సాధించలేకపోయింది. ఇదే క్రమంలో రష్యా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలను ప్రయోగించేందుకు వెనుకాడబోమని అమెరికాతో పాటు యుక్రెయిన్‌ను హెచ్చరించారు.

BREAKING : అణ్వాయుధాలను ప్రయోగిస్తాం.. పుతిన్‌ సంచలన ప్రకటన!
New Update

Russia-Ukraine War : రష్యా(Russia) రాజ్యాధికారం, సార్వభౌమాధికారం లేదా స్వాతంత్య్రానికి ముప్పు ఉంటే అణ్వాయుధాలను ప్రయోగించడానికి రష్యా సిద్ధంగా ఉందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. రష్యా ప్రభుత్వ టెలివిజన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. రెచ్చగొడితే అణు యుద్ధం తప్పదని హెచ్చరించారు. ఈ విషయం అమెరికా(America) గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రష్యా అణు దళాలు ఇందుకు సిద్ధంగా ఉన్నాయని కుండబద్దలు కొట్టారు పుతిన్. యుక్రెయిన్‌ యుద్దభూమిపై అణ్వాయుధాలను ఉపయోగించాలని ఎప్పుడైనా ఆలోచించారా అని జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు పుతిన్‌ ఈ విధంగా సమాధానం చెప్పారు. యుక్రెయిన్‌లో మాస్కో తన లక్ష్యాలను సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు పుతిన్(Putin). చర్చలకు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు పుతిన్. ఏదైనా ఒప్పందానికి పశ్చిమ దేశాల రావొచ్చని చెప్పారు.

రెండేళ్లు దాటినా ఆగలేదు:
రష్యా-యుక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine War) ఫిబ్రవరి 24, 2022న ప్రారంభమైంది. ఇప్పటికీ రెండేళ్లు దాటిపోయింది. ఈ యుద్ధం లక్షల మంది ప్రజల ప్రాణాలను తీసింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసింది. యుక్రెయిన్‌లో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. నగరాలు ధ్వంసమయ్యాయి. యుద్ధం మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టినా కాల్పుల విరమణకు అవకాశం కనిపించడం లేదు. అటు యుక్రెయిన్ ఇప్పటికీ సహాయం కోసం ఆశిస్తోంది.

యుక్రెయిన్‌ పోరాడుతోంది:
యుద్ధంలో సైనిక బలం చాలా ముఖ్యమైనది. యుక్రెయిన్ సైన్యం అంగబలం ఐదు లక్షలు. నాలుగు రెట్లు పెద్దదైన రష్యా సైన్యాన్ని రెండేళ్లపాటు తట్టుకోగలుగుతోంది. సాంకేతికంగా పటిష్టంగా, సుదూర శ్రేణిలో, అత్యాధునిక ఆయుధాలతో కూడిన రష్యా సైన్యం రెండేళ్లలో కూడా యుక్రెయిన్‌పై పట్టు సాధించడంలో విఫలమైంది. అమెరికా సహాయంతో యుక్రెయిన్ రష్యన్ సైన్యంతో పోరాడుతోంది. మరోవైపు రష్యా హ్యాకింగ్‌లో నైపుణ్యాన్ని కలిగి ఉంది. రష్యా హ్యాకర్లు యుక్రెయిన్ ప్రభుత్వానికి చెందిన అన్ని ముఖ్యమైన వెబ్‌సైట్‌లపై సైబర్ దాడులు చేశారు. ఇక యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించని సమయం ఇది. అందుకే రష్యా ఏం చేయాలో అర్థం అవ్వక అణ్వాయుధాలను ప్రయోగిస్తామని బెదిరిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Also Read : రష్యాలో కూలిన కార్గో విమానం..వైరల్ వీడియో..!

#ukraine #russia #putin #russia-ukraine-war
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి