Britain: బ్రిటన్‌లో చెలరేగిన హింస.. 100 మందికి పైగా అరెస్టు

బ్రిటన్‌లో వలసలకు వ్యతిరేకంగా కొన్ని గ్రూపు పిలుపునివ్వడంతో ఘర్షణలు చెలరేగాయి. హల్, బ్రిస్టల్, లీడ్స్, బ్లాక్‌పూల్, స్టోక్‌ ఆన్‌ ట్రెంట్ తదితర ప్రాంతంలో వలసదారులుండే హోటళ్లపై దాడులు జరిగాయి. 100 మందికి పైగా నిరసనకారులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

New Update
Britain: బ్రిటన్‌లో చెలరేగిన హింస.. 100 మందికి పైగా అరెస్టు

బ్రిటన్‌లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. వలసలకు వ్యతిరేకంగా కొన్ని గ్రూపు పిలుపునివ్వడంతో అల్లర్లు నెలకొన్నాయి. హల్, బ్రిస్టల్, లీడ్స్, బ్లాక్‌పూల్, స్టోక్‌ ఆన్‌ ట్రెంట్ తదితర ప్రాంతంలో వలసదారులుండే హోటళ్లపై దాడులు జరిగాయి. పలు చోట్ల పోలీసలకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. 100 మందికి పైగా నిరసనకారులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: బంగ్లాదేశ్‌ ప్రధాని ఇంట్లో అల్లరిమూకల విధ్వంసం.. లండన్‌కు షేక్ హసీనా !

మరోవైపు అతివాదుల చర్యలను అణిచివేయాలని బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే చర్యలు తప్పవని హోంమంత్రి వివెట్ కూపర్‌ హెచ్చరించారు. అయితే ఇంగ్లీష్ డిఫెన్స్‌ లీగ్ (EDL) అనే గ్రూపు ఈ గొడవలకు కారణమని చెబుతున్నారు. వారం రోజుల క్రితం సౌత్‌పోర్ట్‌లో ఓ డ్యాన్స్‌ క్లాస్‌పై దుండగుల దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు చిన్నారులు కత్తిపోట్లకు బలయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా వలసవాద వ్యతిరేక బృందాలు ఆందోళనలు చేపట్టారు. శరణార్థులకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. వలసలు ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మసీదులు, శరణార్థి శిబిరాలపై దాడులకు పాల్పడుతున్నారు.

Also Read: ఒలింపిక్స్‌లో హిస్టరీ క్రియేట్.. టేబుల్‌ టెన్నిస్‌లో క్వార్టర్స్‌కు చేరిన భారత్‌!

Advertisment
తాజా కథనాలు