UIDAI: ఆధార్ సేవలకు అధికంగా వసూలు చేస్తే భారీ జరిమానా..!

ఆధార్ సేవల కోసం అధికంగా వసూలు చేస్తే సంబంధిత ఆపరేటర్‌ను సస్పెండ్‌ చేస్తామని అలాగే వారిని నియమించిన రిజిస్ట్రార్‌కు కూడా రూ.50 వేల జరిమానా విధిస్తామని కేంద్రం హెచ్చరించింది. దీనిపై UIDAI కు మెయిల్ లేదా 1947 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది.

Aadhar Update : ఆధార్ ఫ్రీ అప్‎డేట్ పొడిగింపు..గడువు మరో మూడు నెలల..ఇలా అప్ డేట్ చేసుకోండి..!
New Update

UIDAI Aadhaar Services: ఆధార్ సేవల కోసం అధికంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటివి జరిగేతే సంబంధిత ఆపరేటర్‌ను సస్పెండ్‌ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు వారిని నియమించిన రిజిస్ట్రార్‌కు కూడా రూ.50 వేల జరిమానా విధిస్తామని తెలిపింది. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar) ఈ విధంగా సమాధానం ఇచ్చారు. అయితే ఈ అంశంపై UIDAI కు మెయిల్ లేదా 1947 నెంబర్‌కు ఫోన్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చని మంత్రి సూచనలు చేశారు.

Also Read: హ్యాట్రిక్ కొట్టడం గ్యారెంటీ…టైమ్స్ నౌ ఈటీజీ ఒపీనియన్ పోల్

#national-news #uidai #telugu-news #aadhaar-update
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe