Udhayanidhi Stalin : ఇటీవల సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) వివాదస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వివాదంపై ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పందించారు. నిన్న కరూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ (PM Modi) వాడుకున్నాకంటూ ఆరోపణలు చేశారు. నేను నరమేధానికి పిలుపునిచ్చినట్లు మోదీ ప్రజలకు చెప్పారని.. నేను అనని మాటలు కూడా ప్రధాని వారితో చెప్పినట్లు పేర్కొన్నారు. నేను అందరినీ సమానంగా చూడాలని అన్నానని.. కానీ వారు నా మాటలను వక్రీకరించారంటూ ఆరోపించారు. దీంతో దేశవ్యాప్తంగా నా వ్యాఖ్యలు చర్చనీయం అయ్యాయని తెలిపారు.
Also Read: డిప్యూటీ సీఎం పదవి రేసులో ఆరుగురు అగ్ర నేతలు.. ఎవరో తెలుసా..?
అలాగే నా తలపై ఓ బాబా రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు రివార్డు ప్రకటించారని.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోందని తెలిపారు. నాకు కోర్టులపై నమ్మకం ఉందని అన్నారు. వాళ్లు నన్ను క్షమాపణలు చెప్పాలని కోరినప్పటికీ అలాంటిది ఉండదని చెప్పానని తెలిపారు. తాను స్టాలిన్ కొడుకునని, కలైంజ్ఞందర్ మనువడినని.. వారి భావజాలాన్ని మాత్రమే గౌరవిస్తానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ మాట్లాడారు. సనాతన ధర్మం సామాజిర న్యాయానికి వ్యతిరేకమంటూ పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున దుమారం రేగడంతో.. దీనిపై చర్యలు తీసుకోవాలని కొంతమంది ప్రముఖులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అలాగే ఉదయనిధి స్టాలిన్‌పై వివిధ రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదయ్యాయి.
Also Read: మా పోరాటం కాంగ్రెస్ కు కలిసొచ్చింది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!