Nirmala Sitharaman: తాను మంత్రినని గ్రహించుకుని మాట్లాడాలి...ఉదయనిధికి నిర్మలా సీతారామన్ చురకలు..!!
సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్ అయ్యారు. తాను ఒక రాష్ట్ర మంత్రి అనే విషయాన్ని ఉదయనిధి గుర్తుంచుకోవలని చురకలంటించారు. ప్రతిఒక్కరికి హక్కు ఉంటుందని..తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉందన్నారు. కానీ ఒక మంత్రిగా తనకున్న బాధ్యతలను ఏంటో తెలుసుకుని మాట్లాడటం మంచిదంటూ హితవు పలికారు.