Flight: గాల్లో ఉండగానే ఊడిన విమానం టైరు.. చివరికి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఎయిర్‌పోర్టులో బోయింగ్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే దాని ల్యాండింగ్ గేర్ టైరు ఊడిపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో పెనుముప్పు తప్పింది. చివరికి విమానం డెన్వర్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. By B Aravind 09 Jul 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఎయిర్‌పోర్టులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యూనైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాని ల్యాండింగ్ గేర్ టైరు ఊడిపోయింది. ఆ విమానం లాస్ ఏంజిల్స్ నుంచి డెన్వర్‌కు బయలుదేరుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పైలట్ అప్రమత్తంగా ఉండటంతో ముప్పు తప్పింది. Also Read: విమానంలో కొట్టుకున్న ప్యాసింజెర్లు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చివరికి డెన్వర్‌లో బోయింగ్ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఆ విమానంలో 181 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇదిలాఉండగా బోయింగ్ విమానాల్లో తరచుగా సాంకేతిక సమస్యలు రావడం ఆందోళన కలిగిస్తోంది. తాజా ఘటనపై యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విచారణకు ఆదేశించింది. Also Read: అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి! #telugu-news #flight #flight-tyre #los-angels మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి