Indian 2 : 'ఇండియన్ 2' ఆడియో లాంచ్.. చీఫ్ గెస్టులుగా ఇద్దరు స్టార్ హీరోలు ?

'ఇండియన్ 2' మూవీ ఆడియో లాంఛ్ ని మే 16 న నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆడియో లాంచ్ కి సూపర్ స్టార్ రజినీకాంత్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా రాబోతున్నారట.

Indian 2 : 'ఇండియన్ 2' ఆడియో లాంచ్.. చీఫ్ గెస్టులుగా ఇద్దరు స్టార్ హీరోలు ?
New Update

Indian 2 Audio Launch : సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Director Shankar) దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్(Kamal Hassan) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఇండియన్ 2'(Indian 2). 90's లో వచ్చిన 'ఇండియన్' (తెలుగులో భారతీయుడు) మూవీకి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది. రీసెంట్ గా సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

publive-image

జూన్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా ఆడియో లాంచ్ కి ఇద్దరు స్టార్ హీరోలు గెస్టులుగా హాజరు కానున్నారట. ఇంతకీ ఎవరా హీరోలు?

publive-image

'ఇండియన్ 2' కోసం ఇద్దరు స్టార్ హీరోలు

'ఇండియన్ 2' మూవీ ఆడియో లాంఛ్ ని మే 16 న నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చెన్నై లోని నెహ్రూ స్టేడియంలో గ్రాండ్ గా జరగనున్న ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ కి ఇద్దరు స్టార్ హీరోలు చీఫ్ గెస్టులుగా హాజరు కాబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

publive-image

లేటెస్ట్ ఫిలిం రిపోర్ట్స్ ప్రకారం 'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ముఖ్య అతిథులుగా రాబోతున్నారట. రజినీకాంత్ తో ఆల్రెడీ శంకర్ కి మంచి బాండింగ్ ఉంది. అలాగే రామ్ చరణ్ తో ప్రెజెంట్ 'గేమ్ చేంజర్' సినిమా చేస్తున్నారు శంకర్. ఇక ఈ ఇద్దరూ 'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నటు చెబుతున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు.

Also Read : ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. సినిమాల్లోకి రీ ఎంట్రీ, కొత్త సినిమా పోస్టర్ అదుర్స్

#ram-charan #director-shankar #indian2-audio-launch #indian-2 #rajinikanth
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe