OnePlus 11R : ఒప్పో నుంచి రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్...ధర, ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు..!! ఒప్పో భారత్ లో రెనో సీరిస్ నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు రెనో 11, రెనో11 ప్రో మోడల్ ను లాంచ్ చేసింది.రెనో 11 ప్రో ధర రూ. 39,999కాగా, రెనో 11 ధర రూ. 31,999గా నిర్ణయించింది కంపెనీ. జనవరి 25 నుంచి ఫ్లిప్ కార్ట్, ఒప్పో వెబ్ సైట్లలో అందుబాటులో ఉండనున్నాయి. By Bhoomi 12 Jan 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఒప్పో (Oppo Reno 11) సిరీస్ లో రెండు స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సిరీస్ కింద, ఒప్పో రెనో 11( Oppo Reno 11), ఒప్పో రెనో 11 ప్రో ( Reno 11 Pro ) అనే రెండు మోడల్‌లు భారతదేశంలో లాంచ్ అయ్యాయి. అయితే కంపెనీ ఈ సంవత్సరం ప్రో+ వేరియంట్‌ను విడుదల చేయలేదు. కొత్త ఒప్పో 5జీ (Oppo 5G) ఫోన్‌ల ధర రూ.40,000లోపే ఉందని కంపెనీ పేర్కొంది. ప్రో మోడల్ వన్ ప్లస్ 11ఆర్ (OnePlus 11R) ఐక్యూ నియో 7 ప్రో వంటి మోడళ్లతో పోటీపడుతుంది. కొత్త ఫోన్లు ఫోటోగ్రఫీ కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.వేవ్ గ్రీన్, రాక్ గ్రే రంగుల్లో లభించనున్నాయి. ధర : ఒక ఒప్పో రెనో 11 ప్రో 5జీ ధర రూ. 39, 999గా కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను వినియోగదారులు జనవరి 25 నుంచి కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో ఒప్పో రెనో 11 5జీ 128జీబీ వేరియంట్ ధర రూ. 29,999 కాగా, 256జీబీ వేరియంట్ ధరరూ. 31,999గా నిర్ణయించింది కంపెనీ. కస్టమర్లు ఈ ఫోన్లను ఫ్లిప్ కార్ట్, ఒప్పో ఇ స్టోర్ మెయిన్‌లైన్ రిటైల్ ఛానెల్‌ల నుండి కొనుగోలు చేసుకోవచ్చు. స్పెసిఫికేషన్‌లు: ఒప్పో రెనో11 లో MediaTek Dimensity 7050 ప్రాసెసర్ ఇవ్వబడింది. Pro మోడల్‌లో MediaTek Dimensity 8200 ప్రాసెసర్ ఇవ్వబడింది. ఇతర స్పెసిఫికేషన్ల గురించి తెలసుకుంటే... ఒప్పో రెనో 11 మోడల్స్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.70-అంగుళాల పూర్తి-HD+ AMOLED కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా, ప్రో మోడల్‌లో HDR 10+కి కూడా మద్దతు ఉంది. రక్షణ కోసం ప్యానెల్‌లో డ్రాగన్‌ట్రైల్ స్టార్ 2 గ్లాస్ ఉంది. ఫొటోగ్రఫీ కోసం ప్రత్యేకంగా: అలాగే ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీని ప్రైమరీ కెమెరా 50మెగాపిక్సెల్. అలాగే, ప్రో మోడల్‌లో 32మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 8మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం రెండు ఫోన్‌ల ముందు భాగంలో 32MP కెమెరాను అందించారు. Reno 11 Pro 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,600mAh బ్యాటరీని కలిగి ఉంది. అదే సమయంలో, Oppo Reno 11 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది కూడా చదవండి: స్ట్రగుల్లో ఇషాన్ కిషన్ కెరీర్.. ఏ స్పష్టత లేదంటున్న బోర్డ్ #tech-news #tech-news-telugu #oneplus #oneplus-11r #oppo మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి