Maoists : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పులు జరిగాయి. ఈ దాడుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వీళ్లలో ఒక మహిళా మావోయిస్టుతో సహా మరో దళ సభ్యుడు ఉన్నారు.

Maoists : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి
New Update

Two Maoists Killed In Bijapur : ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) లో మరోసారి కాల్పులు జరిగాయి. ఈ దాడుల్లో ఇద్దరు మావోయిస్టులు (Maoists) మృతి చెందారు. వీళ్లలో ఒక మహిళా మావోయిస్టుతో సహా మరో దళ సభ్యుడు ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బీజాపూర్ జిల్లా బద్దేడ్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బద్దెపాలా అటవీ ప్రాంతం (Forest Area) లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు బుధవారం ఉదయం ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి.

Also Read: తెలంగాణలో కులగణనకు సిద్ధం.. ఎప్పటినుంచంటే

ఈ క్రమంలోనే మావోయిస్టులు, జవాన్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఇరువర్గాల మధ్య 20 నిమిషాల పాటు ఈ కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందగా.. మరికొందరు అటవీమార్గంలో పారిపోయారు. ఘటనాస్థలం నుంచి భద్రత బలగాలు ఆయుధాలు, వస్తు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఇదిలాఉండగా.. లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరుగుతున్న నేపథ్యంలో.. పోలీసులు, మావోయిస్టల మధ్య వరుసగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 50కి పాగా మావోయిస్టులు కాల్పుల్లో మృతి చెందారు. మరికొందరు లొంగిపోయారు.

Also Read: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. హాల్‌టికెట్లు విడుదల ఎప్పుడంటే

#chhattisgarh #maoists #telugu-news #bijapur
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి