Elephant Attack: ఎనుగుల దాడి.. ఇద్దరు మృతి

జార్ఖండ్‌లోని ఈస్ట్‌ సింగ్‌భుమ్ జిల్లాలో రెండు వేరు వేరు ఏనుగుల దాడి ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. చౌతియా గ్రామంలో ఉన్న ఓ వ్యక్తిని ఏనుగు తొక్కి చంపగా.. డిఘీ గ్రామంలో మరో ఏనుగు ఓ ఇంటిపై దాడి చేసింది. ఇంటి గోడ కూలడంతో లోపల నిద్రిస్తున్న ఓ వృద్ధురాలు మృతి చెందింది.

Elephant Attack: ఎనుగుల దాడి.. ఇద్దరు మృతి
New Update

జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఈస్ట్‌ సింగ్‌భుమ్ అనే జిల్లాలో రెండు వేరు వేరు ఏనుగుల దాడి ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. అటవీ ప్రాంతంలో ఉన్న చౌతియా గ్రామంలో ఆదివారం తెల్లవారుజామన ఓ వ్యక్తిని ఏనుగు తొక్కి చంపేసింది. అలాగే ఇదే జిల్లాలోని శనివారం రాత్రి డిఘీ అనే గ్రామంలో మరో ఏనుగు ఓ ఇంటిపై దాడి చేసింది. ఇంటి గోడ కూలడంతో లోపల నిద్రిస్తున్న ఓ వృద్ధురాలు మృతి చెందింది.

Also Read: OTT ప్రయోజనాలతో జియో మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు!

ఈస్ట్‌ సింగ్‌భుమ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఇలా వరుసగా ఏనుగుల దాడులు జరగుతుండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని.. అలాగే ఈ దాడుల్లో మరణించినవారికి పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Also read: 20 మందిని పెళ్లి చేసుకొని డబ్బులు, నగలతో పరార్‌.. చివరికి



#telugu-news #national-news #jharkhand #elephant-attack
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe