పానీపూరీ తిని ఒకే ఇంట్లో ఇద్దరు చిన్నారుల మృతి

చిన్నపిల్లలనుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే పానీపూరి ఓ ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలితీసుకుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగిన ఈ ఘటనలో మృతులిద్దరూ నంద్యాల జిల్లా రేచర్ల గ్రామానికి చెందినవారని,ఉపాధి కోసం కుటుంబంతో జంగారెడ్డిగూడెం వచ్చారని బంధువులు తెలిపారు.

పానీపూరీ తిని ఒకే ఇంట్లో ఇద్దరు చిన్నారుల మృతి
New Update

Eluru : ఏలూరు జిల్లా:జంగారెడ్డిగూడెం లో పానిపూరి తిని ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది.పాని పూరి తిన్న ఇద్దరు చిన్నారులు వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో మృతి చెందారు. చిన్నారులు తిన్న ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల మృతి చెంది వుండవచ్చని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులు నంద్యాల జిల్లా రేచర్ల గ్రామానికి చెందిన రామ కృష్ణ(10), విజయ్ (6) లు అని రూ.100 ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకోవడానికి ఉపాధి కోసం కుటుంబంతో జంగారెడ్డిగూడెం వచ్చారని బంధువులు తెలిపారు.  జంగారెడ్డిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.. అనుమానాస్పద మరణం

కడుపునొప్పితో చనిపోయిన ఇద్దరు పిల్లలు నంద్యాలకు చెందిన జంగాల కులస్తులని ,సంచారం చేస్తూ పెద్ద టౌన్స్లో ప్లాస్టిక్ సామానులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారని చెప్పారు.అయితే.. గత రాత్రి ఇద్దరు  పిల్లలను తీసుకుని తల్లిదండ్రులు పానీపూరి బండి దగ్గరకు వెళ్లి పానీపూరి తిని ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకోవడం జరిగిందని , తెల్లవారు జామున  మూడు గంటల టైంలో ఇద్దరు మగపిల్లలకు కడుపునొప్పి రావడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లడం జరిగిందని , ఆ తరువాత పెద్ద  హాస్పిటల్ కు తీసుకెళ్లే మార్గంలో పిల్లలిద్దరూ చనిపోవడం జరిగిందని వివరాలు వెల్లడించారు. ఈ కేసుని అనుమానాస్పదమరణం కింద 174 సెక్షన్ ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కేసులో ముఖ్యంగా  గమనిస్తే ..  ఆ చుట్టూ పక్కల ఉన్న గుడిసెల్లో ఉన్నవాళ్లు మంచాల మీద పడుకున్నట్లు అర్ధమయిందని . వీళ్ళు  కింద నేల మీద పడుకున్నారు. చుట్టుపక్కలా పొలాలు ఉన్నాయి. పురుగు పుట్ట అనేది ఇక అనుమానం కలిగిస్తోందని అన్నారు,. అంతేకాకుండా వీళ్ళు   రాత్రి తిన్న ఫుడ్ ను కూడా సీజ్ చేయడం జరిగింది.  కేసు రిజిస్టర్ చేసి పోస్ట్ మార్టం కు పంపించాం. దర్యాప్తులో ఎంపీ<మోస్ట్ మార్టం రిపోర్ట్ ను బట్టి ఫర్దర్ గా యాక్షన్ తీసుకుంటామని పోలీసు అధికారి వెల్లడించారు.

ALSO READ :మ్యాచ్ జరుగుతుండగా ఉప్పల్ గ్రౌండ్లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ అభిమాని

#two-children-died #jangareddygudem #ap-crime-report #pani-puri #eluru-district
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe