Telangana: బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్.. కాంగ్రెస్‌లోకి ఇద్దరు ఎమ్మెల్సీలు

వరంగల్‌లో బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌ హయాంలో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన బసవరాజు సారయ్య, బండ ప్రకాష్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గతంలో వీళ్లు కాంగ్రెస్‌లోనే పనిచేశారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలో సారయ్య మంత్రిగా కూడా పనిచేశారు.

New Update
Telangana: బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్.. కాంగ్రెస్‌లోకి ఇద్దరు ఎమ్మెల్సీలు

Warangal BRS MLC: వరంగల్‌లో బీఆర్‌ఎస్‌కు (BRS) మరో బిగ్‌షాక్‌ తగిలింది. మరో ఇద్దరు బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. నిన్న సీఎం రేవంత్ వరంగల్ టూర్ సందర్భంగా పలువురు కాంగ్రెస్‌ (Congress) పెద్దలను బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీలు కలిశారు. బసవరాజు సారయ్య (MLC Basavaraj Sarayya), బండ ప్రకాష్ (Banda Prakash) బీఆర్‌ఎస్‌ హయాంలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. గతంలో వీళ్లు కాంగ్రెస్‌లోనే పనిచేశారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలో సారయ్య మంత్రిగా కూడా పనిచేశారు. 2016లో బీఆర్‌ఎస్ తీర్థం తీసుకున్న బసవరాజు సారయ్య.. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తు్న్నారు. ఇదిలాఉండగా.. ఇప్పటికే వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ నుంచి ముఖ్య నేతలైన కడియం కడియం శ్రీహరి, పసునూరి దయాకర్‌, గుండు సుధారాణి కాంగ్రెస్‌లోకి చేరారు.

Also read: హైదరాబాద్‌లో దంచికొట్టిన వానా.. భారీగా ట్రాఫిక్ జాం

Advertisment
తాజా కథనాలు