Dawood Ibrahim : దావుద్‌ తో స్టార్ హీరో భార్యకు సంబంధాలు.. ఆ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన నటి!

దావుద్‌ ఇబ్రహీం నిర్వహించిన ఓ పార్టీలో డ్యాన్స్ చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని నటి ట్వింకిల్ ఖన్నా ఖండించారు. టెక్నాలజీని ఆధారంగా చేసుకుని కొంతమంది తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఫేక్ న్యూస్ చూసి పిల్లలు కూడా నవ్వుకున్నారంటూ పలు విషయాలు బయటపెట్టారు.

New Update
Dawood Ibrahim : దావుద్‌ తో స్టార్ హీరో భార్యకు సంబంధాలు.. ఆ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన నటి!

Star Hero : అండర్ వరల్డ్ డాన్‌ దావుద్‌ ఇబ్రహీం(Dawood Ibrahim) తో తనకు సంబంధాలున్నట్లు వస్తున్న వార్తలపై బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) భార్య, నటి ట్వింకిట్ ఖన్నా(Twinkle Khanna) ఎట్టకేలకు స్పందించారు. అంతేకాదు తాను దావుద్ కోసం ఓ పార్టీలో డ్యాన్స్ చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ట్వింకిల్ దాదాపు పదేళ్ల క్రితం నుంచి ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: The Delhi Files: స్టార్ లతో మాకు పనిలేదు.. ‘ది ఢిల్లీ ఫైల్స్‌’ నుంచి వివేక్ బిగ్ అప్ డేట్!

నా పిల్లలు కూడా నవ్వుకున్నారు..
ఈ మేరకు ట్వింకిట్ మాట్లాడుతూ.. టెక్నాలజీని ఆధారంగా చేసుకుని కొంతమంది తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డారు. ‘కరోనా టైమ్ లో ఫేక్‌ వార్తలు ఎక్కువగా వచ్చాయి. రెజ్లర్ల నిరసనలో వినేశ్‌, సంగీత ఫొగాట్‌ నవ్వుతూ ఉన్నట్లు మార్ఫింగ్‌ ఫొటోలూ వైరల్ అయ్యాయి. టెక్నాలజీని అబాసుపాలు చేస్తున్నారు. అవాస్తవ కథనాలు సృష్టిస్తున్నారు. గతంలో నా పైనా ఇలాంటి ప్రచారాలు జరిగాయి. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావుద్‌ ఇబ్రహీం పార్టీలో డ్యాన్స్‌ చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. వాటిని చూసి నా పిల్లలు కూడా నవ్వుకున్నారు. నేను డ్యాన్స్‌ చేస్తే ఎలా ఉంటుందో నా ఫ్యామిలీకి బాగా తెలుసు. అందుకే వాటిని ఎవరూ నమ్మలేదు. దావుద్‌ కావాలనుకుంటే నాకంటే గొప్ప డ్యాన్సర్స్‌ను పెట్టుకుంటారు. ఏకంగా ఓ పార్టీలో దొరికపోయాననం విడ్డూరంగా ఉంది‘ అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ మరోసారి వైరల్ అవుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు