Viral Video: లైవ్‌లో నోరు జారిన రిపోర్టర్..వీడియో వైరల్

టీవీ రిపోర్టర్‌లు, యాంకర్లు లైవ్‌లో ఉన్నప్పుడు చాలాసార్లు మాటలు తప్పుగా మాట్లాడుతుంటారు. లైవ్‌లో, ఫ్లో లో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా పొరపాట్లు అవుతూ ఉంటాయి. అయితే ఇవి ఒక్కోసారి బ్లండర్ మిస్టేక్స్ అయిపోతూ ఉంటాయి. తాజాగా సీఎన్‌బీసీ-టీవీ 18 రిపోర్టర్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

Viral Video: లైవ్‌లో నోరు జారిన రిపోర్టర్..వీడియో వైరల్
New Update

CNBC- TV18 Reporter: జర్నలిజంలో రిపోర్టింగ్ జాబ్ కొంచెం కష్టమైనదే. రిపోర్టర్‌గా చేసేవాళ్ళకు అమితమైన నాలెడ్జ్‌తో పాటూ అప్పటికప్పుడు మాట్లాడగలిగే చాతుర్యం కూడా ఉండాలి. లైవ్‌లో జరిగింది జరిగినట్టు చెప్పగలగాలి. పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసి కూడా ఉండాలి. దాంతో పాటూ సరైన పదాల వాడుక కూడా వచ్చి ఉండాలి. ఎలా పడితే అలా నోటికొచ్చినట్టు వాగకూడదు. సాధారణంగా రిపోర్టింగ్‌లో ఉన్నవాళ్లు అందరూ ఈ విషయంలో జాగ్రత్తగానే ఉంటారు. మాట్లాడ్డంలో తడబడినా కూడా తప్పులు దొర్లకుండా చూసుకుంటారు. కానీ ఎక్కడో ఒక చోట వారికి తెలియకుండానే లేదా అలవాటులో పొరపాటు వల్ల తప్పు పదాలు వచ్చేస్తూ ఉంటాయి. వాడకూడని పదాలు వాడడం వల్లనో, అస్సలు సంబంధం లేని పదాలు వాడ్డమో చేస్తుంటారు. అలాంటప్పుడు మాత్రం అడ్డంగా దొరికిపోతారు. అదే అయితే కనుక విపరీతమైన ట్రోలింగ్‌కు గురవుతారు రిపోర్టర్లు.

తాజాగా సీఎన్‌బీసీ- టీవీ 18 రిపోర్టర్‌కు ఇదే అనుభవం ఎదురైంది. సీఎన్‌బీసీ- టీవీ 18లో పనిచేసే అష్మిత్ అనే రిపోర్టర్ ప్రస్తుతం విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతున్నారు. రీసెంట్‌గా పతంజలి కేసు విషయంలో అతను రిపోర్టింగ్ చేశారు. అందులో భాగంగా అసభ్యపదజాలాన్ని వాడారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయడంలో మళ్ళీ ఇంకో తప్పు పదం కూడా వాడేశారు. చివరకు మొత్తం విషయం గ్రహించినా...అప్పటికే అది లైవ్‌లోకి వెళ్ళిపోయింది. దీంతో అష్మిత్ రిపోర్టింగ్ ఎయిర్ అయిపోయింది. పాపం అదే టైమ్‌లో స్టూడియోలో ఉన్న యాంకర్ అష్మిత్ మాటను కట్ చేసి..మళ్ళీ తిరిగి వస్తాము అని చెప్పినప్పటికీ దాన్ని అంతకు మించి సరిదిద్దలేకపోయారు.

అష్మిత్ ప్రయోగించిన అసభ్యపదజాలం మీద సీఎన్‌బీసీ ఛానెల్‌కూడా స్పందించింది. అతను వాడిన పదాలకు క్షమాపణలు కూడా చెప్పింది. అనుకోకుండా జరిగిందని...ఇక మీదట అలా జరగకుండా చూసుకుంటామని చెప్పింది. అత్యున్నత ప్రమాణాలు పాటించడానికి కట్టుబడి ఉంటామని టీవీ యాజమాన్యం ప్రకటించింది. రిపోర్టర్‌ కూడా క్షమాపణలు చెప్పారు. ఒక్కసారే తప్పు జరిగింది కాబట్టి ఏమీ చర్యలు తీసుకోవద్దని కోరారు అష్మిత్, సీఎన్‌బీసీ ఛానెల్‌ కూడా.

అయితే అష్మిత్ వీడియో మాత్రం బాగా వైరల్ అయిపోయింది. అష్మిత వాడిన పదాలకు నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు. కానీ చాలా మంది రిపోర్టర్‌ను సపోర్ట్ చేస్తున్నారు. మానవ తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి. అష్మిత్ మంచి రిపోర్టర్‌ అని...జరిగిన ఘటనను సీరియస్‌గా తీసుకోకూడదని అంటున్నారు. అష్మిత్ కానీ, రిపోర్టర్లు కానీ ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

Also Read:Andhra Pradesh: చింతమనేనికి లైన్‌ క్లియర్..వీడిన సస్పెన్స్

#video #viral #live #cnbc-tv18 #reporter #abusing-words
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe