Shirdi tour:కేవలం రూ.12, 499కే శిరిడీ విమాన యాత్ర..టీఎస్టీడీసీ అదిరే ప్లాన్

తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ తన సేవలను విస్తరిస్తోంది. శిరిడీ సాయి దర్శనానికి ఏసీ బస్సులను స్టార్ట్ చేసిన టీఎస్టీడీసీ దాన్ని మరింత ముందుకు తీసుకవెళుతూ విమాన పర్యాటకాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది.

New Update
Shirdi tour:కేవలం రూ.12, 499కే శిరిడీ విమాన యాత్ర..టీఎస్టీడీసీ అదిరే ప్లాన్

భారతదేశంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రాల కోవలోకి వస్తుంది శిరిడీ. ఇక్కడకు రోజూ వేలిది మంది భక్తులు తరలి వెళుతుంటారు. హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది శిరిడీ సాయి దర్శనానికి వెళుతుంటారు. వారి కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఎప్పటికప్పుడు ప్రత్యేక ఏర్పట్లను చేస్తూనే ఉంది. రీసెంట్ గా శిరిడీకి ఏసీ బస్సులను వేసిన టీఎస్టీడీసీ ఇప్పుడు విమాన సర్వీసులను కూడా మొదలుపెట్టింది.

Also Read:వరల్డ్ కప్ ఫైనల్ కు ఫుల్ హంగామా..గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న బీసీసీఐ

విమాన పర్యాటకంలో భాగంగా ఒక ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు టీఎస్‌టీడీసీ ఎండీ మనోహర్‌. శిరిడీ యాత్రను రూ.12,499 ల టికెట్ ధరతో అందుబాటులోకి తెచ్చారు. ఇందులో భాగంగా యాత్రికులను హైదరాబాద్‌లో విమానాశ్రయానికి చేర్చడం దగ్గర నుంచీ, సాయి దర్శనం, శిర్డీలో స్థానికంగా పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడం కూడా తమదే బాధ్యత అని తెలిపారు. భోజనం, వసతి కూడా ఇందులోనే ఉంటుందన్నారు. ఈ ప్యాకేజీలో భక్తులు హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు విమానంలో బయల్దేరి 2.30 గంటలకు శిర్డీ చేరుకుంటారు. హోటల్‌లో బస, సాయంత్రం 4.30 గంటలకు శిర్డీ సాయి దర్శనం ఉంటుంది. సాయంత్రం ఆరతి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత రాత్రి 7 గంటలకు బాబా థీమ్‌ పార్కులోని సౌండ్‌ అండ్‌ లైట్‌ షో చూడొచ్చు. ఆ రాత్రికి అక్కడే బస చేశాక మరునాడు ఉదయం 8 గంటలకు పంచముఖి గణపతి మందిర దర్శనం ఉంటుంది. పాత శిర్డీ, ఖండోబా మందిర్‌, సాయి తీర్థం దర్శనాల అనంతరం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు విమానంలో బయలుదేరి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అయితే ఇందులో కొన్ని దర్శనాలకు టికెట్లు మాత్రం స్వయంగా కొనుక్కోవాల్సి ఉంటుంది.

ప్యాకేజి పూర్తి వివరాల కోసం 98485 40371, 98481 25720 నంబర్లలో సంప్రదించాలని టీఎస్‌టీడీసీ తెలిపింది. రెండు రోజుల్లో మొత్తం యాత్ర అంతా అయిపోవడం, శ్రమ తక్కువగా ఉండడం వలన భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుందని చెబుతోంది.

Also Read:ఉత్తరం అయిపోయింది…దక్షిణ మీద పడ్డ ఇజ్రాయెల్

Advertisment
తాజా కథనాలు