TSRTC MD : సెలవు ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ మృతి.. సజ్జనార్ వివరణ

Hyderabad : హైదరాబాద్ వాసులకు TGRTC అదిరిపోయే శుభవార్త!
New Update

TSRTC MD Sajjanar : నల్లగొండ జిల్లా(Nalgonda District) దేవరకొండ డిపోనకు చెందిన డ్రైవర్‌ శంకర్ కు సెలవు మంజూరు చేయకుండా ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్యాయత్నం(Suicide) చేసుకున్నారని వస్తోన్న వార్తల్లో నిజం లేదని అన్నారు సజ్జనార్(Sajjanar). "ఆ డ్రైవర్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ నెల 18, 19 తేదీల్లో విధులకు గైర్హాజరు అయ్యారు. అయినా ఈ నెల 20న డ్యూటీని అధికారులు కేటాయించడం జరిగింది. మళ్ళీ ఆదివారం సెలవు కావాలని డిపో అధికారులను సంప్రదించడం జరిగింది. వాళ్ళు లీవ్ పొజిషన్ చూసి సెలవు మంజూరు చేస్తామని చెప్పారు. సెలవు ఇవ్వబోమని చెప్పలేదు.

ALSO READ: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్!

తనకు సెలవు మంజూరు చేయకుండా అధికారులు వేధిస్తున్నారని, పురుగుల మందు తాగుతున్ననంటూ ఒక సెల్ఫీ వీడియో(Selfie Video) వాట్సాప్ గ్రూప్(WhatsApp Group) ల్లో శనివారం శంకర్ షేర్ చేయడం జరిగింది. వెంటనే డిపో అధికారులు అక్కడికి వెళ్లి ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ ఎలాంటి పురుగుల మందు తాగలేదని వైద్యులు ధ్రువీకరించి.. డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం డ్రైవర్ శంకర్ తన ఇంటి వద్ద సురక్షితంగా ఉన్నారు.

డ్రైవర్ శంకర్ ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడ్డారు. గతంలోనూ సెలవుల విషయంలో అధికారులపై బెదిరింపులకు దిగారు. ఆయన లీవ్ రికార్డు సరిగా లేదు. గత మూడు నెలల్లో 10 సాధారణ లీవ్ లు, 20 సిక్ లీవ్ లను డ్రైవర్ శంకర్ తీసుకున్నారు.

సిబ్బందికి సెలవుల మంజూరు విషయంలో నిబంధనల ప్రకారమే సంస్ట నడుచుకుంటోంది. లీవ్ పొజిషన్, కారణం తీవ్రతను బట్టి సెలవులను మంజూరు చేస్తోంది. ఉద్దేశ్యపూర్వకంగా, సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ ఏమాత్రం ఉపేక్షించదు. ఇలాంటి ఘటనలపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది." అని అన్నారు.

#tsrtc #vc-sajjanar #nalgonda-district #driver-suicide
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe