TS TET 2024: టెట్‌ దరఖాస్తుదారులకు గుడ్‌ న్యూస్.. ఫ్రీగా మాక్ టెస్టులు

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ (TET)కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు.. ఉచితంగా మాక్‌ టెస్టులు రాసే అవకాశాన్ని కల్పించింది రాష్ట్ర విద్యాశాఖ. మాక్ టెస్టులు ఎలా రాయాలో తెలియాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.

New Update
TS TET 2024: టెట్‌ దరఖాస్తుదారులకు గుడ్‌ న్యూస్.. ఫ్రీగా మాక్ టెస్టులు

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ (TET)కు దరఖాస్తు చేసిన అభ్యర్థుల కోసం విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షలో ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు.. ఉచితంగా మాక్‌ టెస్టులు రాసే అవకాశాన్ని అభ్యర్థులకు కల్పించింది. డీఎస్సీ ఉన్న నేపథ్యంలో.. టెట్ మార్కులు కీలకంగా మారనున్నాయి. అందుకే టెట్‌లో మంచి మార్కులు సాధించేదుకు చాలామంది పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు. పరీక్షలో మంచి మార్కులు సాధించాలంటే మాక్ టెస్టులు రాయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే విద్యాశాఖ టెట్‌ అభ్యర్థుల కోసం ఫ్రీగా మాక్ టెస్టులు రాసే అవకాశం కల్పించింది.

Also read: బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు

మాక్ టెస్టు ఎలా రాయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1.టెట్‌కు అప్లై చేసుకున్న అభ్యర్థులు ముందుగా https://tstet2024.aptonline.in/tstet/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
2.హోం పేజీలో పైన కనిపించే TS TET Mock Test -2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
3.ఆ తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మాక్ టెస్టు సంబంధించిన సూచనలు ఉంటాయి. వాటిని చదివి Next బటన్‌ను నొక్కాలి
4.తర్వాత డిక్లరేషన్‌ బాక్స్‌లో టిక్ కొట్టి ఐ యామ్ రెడీ టూ బిగిన్ ఆప్షన్‌ పై క్లిక్ చేయాలి
5.అనంతరం ప్రశ్నాపత్రం డిస్‌ప్లే అవుతుంది. కుడివైపున టైం కూడా కనిపిస్తుంది. టైం అయ్యే లోపల అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
6.ఇలా ఎన్నిసార్లైనా మాక్‌ టెస్టులు రాసుకోవచ్చు
7.ఈ పరీక్షలు రాయడం వల్ల ఆన్‌లైన్‌లో పోటీ పరీక్షలు రాసేటప్పుడు అభ్యర్థులకు మంచి అవగాహన వస్తుంది

Also Read: ఎన్నో పోరాటాలు.. అనేక అవమానాలు.. ఇంకెన్నో విజయాలు.. బీఆర్ఎస్ 23 ఏళ్ల ప్రస్థానం!

ఇదిలాఉండగా.. టెట్ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. మొత్తం 2,83,441 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పరీక్షలు మే 20 నుంచి ప్రారంభం అయ్యి.. జూన్ 3 వరకు కొనసాగుతాయి. మే 15 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక జూన్ 12న ఫలితాలు విడుదల కానున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు