Government Schools:రాష్ట్రంలో గవర్నమెంటు బడుల్లో చదివే పిల్లలకు గుడ్ న్యూస్ చెప్పనుంది తెలంగాణ ప్రభుత్వం. విద్యార్ధులకు యూనిఫార్మ్స్‌తో పాటూ మిగిలనవన్నీ కూడా తామే ఇస్తామని అంటోంది. బ్యాగు, షూస్ లాంటివి ఇస్తామని చెబుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని, బడ్జెట్‌ను కేంద్రానికి పంపిస్తామని ప్రభుత్వ విద్యాశాఖాధికారులు తెలిపారు.
Also read:Delhi Boy:ఆ పిల్లాడు అంతకు ముందే చనిపోయాడు..హరిద్వార్ ఘటనలో బయటపడ్డ నిజాలు
ప్రస్తుతం యూనిఫామ్ మాత్రమే...
ఇప్పటి వరకూ గవర్నమెంటు స్కూళ్ళల్లో కేవలం 2 యూనిఫార్మ్స్ మాత్రమే ఇస్తున్నారు. గతేడాది కార్పొరేట్ లుక్ ఉండేలా యూనిఫామ్ కలర్‌తో పాటూ డిజైన్ కూడా మార్చారు. అయితే షూస్ అవీ మాఈత్రం ఇవ్వడం లేదు. ఇవి ఇవ్వాలని ప్రభుత్వ విద్యాశాఖ మూడేళ్ళ నుంచి ప్రతిపాదనలు పెడుతోంది. కానీ అవి రిజెక్ట్ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే కొనుక్కోవాలని కేంద్రం సూచిస్తోంది. బీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు అన్నీ విషలం అయ్యాయి. ఇప్పుగు గవర్నమెంటు మారడంతో మళ్ళీ ఈ ప్రొపోజల్ మీద ఆశలు చిగురించాయి. అందుకే త్వరలో ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో షూప్, బెల్ట్, టై, సాక్స్‌ల కోసం ప్రతిపాదనలు పెట్టాలని విద్యాశాఖాధికారులు రెడీ అయ్యారు.
290 కోట్లు అవసరమవుతాయి...
కేంద్రం దీనికి కనుక ఆమోదం తెలిపితే 290రూ. కోట్ల ఖర్చులో కేంద్రం 60శాతం ఇస్తుంది. ఈ స్కీమ్ వలన తెలంగాణ మొత్తం ఉన్న 26 వేల ప్రభుత్వ బడుల్లో 25 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరుతుంది. ఈసారి దీనిని కేంద్రం ఆమోదించే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని అంటున్నారు.
Also Read:KTR: సుమతీ శతకం పద్యంతో కేటీఆర్ ట్వీట్..సోషల్ మీడియాలో వైరల్