Revanth Reddy :తెలంగాణలో బిల్లా రంగాలు ఇద్దరు జనం మీద పడ్డారు.. రేవంత్‌రెడ్డి హాట్‌ కామెంట్స్!

తెలంగాణలో బిల్లా, రంగాలు ఇద్దరు జనం మీద పడ్డారన్నారు రేవంత్‌రెడ్డి. కేసీఆర్‌కు ముఖం చెల్లక బిల్లా రంగాలు తిరుగుతున్నారని.. కాంగ్రెస్ ఏం చేసిందో బిల్లా రంగాలు కేసీఆర్‌ను అడిగితే చెబుతారన్నారు. మరుగుజ్జులు ఎవరో... ప్రజల మనుషులు ఎవరో 45 రోజుల్లో తేలుతుందన్నారు రేవంత్‌రెడ్డి.

New Update
CM Revanth Reddy: అందుకే కేసీఆర్ ఓడిపోయాడు.. రేవంత్ కీలక వ్యాఖ్యలు

Revanth Reddy: మీరు అనుభవిస్తున్న పదవులు, హోదా కాంగ్రెస్ పెట్టిన బిక్ష అంటూ బీఆర్‌ఎస్‌(BRS) పెద్దల టార్గెట్‌గా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (TPCC Chief Revanth Reddy) హాట్‌ కామెంట్స్ చేశారు. ఎక్కడా లేని విధంగా ఆరోగ్య శ్రీ (Arogyasri), రైతు రుణమాఫీ, ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్ లాంటి పథకాలు అమలు చేసింది కాంగ్రెసేనన్నారు రేవంత్‌రెడ్డి. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లో చేస్తున్న అభివృద్ధి మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్‌లో (Congress) చేరారని.. తాను పోటీ చేసే స్థానాన్ని వంశీ చంద్ రెడ్డి, నారాయణ రెడ్డికి ఇచ్చి ఆహ్వానించారన్నారు రేవంత్‌రెడ్డి. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నానని.. తెలంగాణ మిగతా నాయకులు వంశీచంద్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలన్నారు రేవంత్‌రెడ్డి.

రేవంత్ రెడ్డి ఇంకా ఏం అన్నారంటే?

➼ తెలంగాణలో బిల్లా, రంగాలు ఇద్దరు జనం మీద పడ్డారు

➼ కేసీఆర్‌(CM KCR)కు ముఖం చెల్లక బిల్లా రంగాలు తిరుగుతున్నారు

➼ కాంగ్రెస్ ఏం చేసిందో బిల్లా రంగాలు కేసీఆర్‌ను అడిగితే చెబుతారు.

➼ ఎందుకు వివక్ష చూపుతున్నారు?

➼ తెలంగాణలోనే సమాన అభివృద్ధి చేయని మీరు కాంగ్రెస్‌ను విమర్శిస్తారా?

➼ ఛత్తీస్‌ఘడ్‌లో, హిమాచల్‌లో అమలు చేస్తున్న పథకాలు మీ దగ్గర ఉన్నాయా?

➼ ఉచిత కరెంట్ హామీని రాజశేఖర రెడ్డి అమలు చేసి చూపించారు

➼ ఏం చేశారో చెప్పుకోడానికి ఏమీ లేక కిరాయి మనుషులను తెచ్చుకుని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు

➼ మరుగుజ్జులు ఎవరో... ప్రజల మనుషులు ఎవరో 45 రోజుల్లో తేలుతుంది..

➼ ఓడిపోతే పారి పోదాం అని ఇతర దేశాల పాస్ పోర్ట్ లు తీసుకున్నారు.

➼ వాటి మీద అధికారంలోకి రాగానే విచారణ జరుపుతాం

➼ మా దగ్గర ప్రభుత్వం లేదు. పదవులు లేవు. అయినా సరే.. కసిరెడ్డి, మైనంపల్లి, రేఖా నాయక్ పదవుల్లో ఉండి మా దగ్గరకు వచ్చారు

➼ బీఆర్ ఎస్ ప్రాధాన్యత ఎన్నికలు, ఓట్లు సీట్లు.... కాంగ్రెస్ ప్రాధాన్యత ప్రజల సంక్షేమం

బీజేపీపైనా విమర్శలు:
అటు బీజేపీని కూడా వదల్లేదు రేవంత్‌రెడ్డి. ప్రజలకు ఏం చేస్తామో మేం అదే చెబుతామన్నారు. బీజేపీకి అభ్యర్థులు లేరు.. మానిఫెస్టో లేదన్నారు. తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ అధికారంలో లేదని.. తెలంగాణ వచ్చాక రెండు సార్లు అధికారంలో ఉన్నది బీఆర్‌ఎసేనన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మా పదేళ్ల పాలన... తెలంగాణలో మీ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమానని ప్రశ్నించారు. రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రం ఇస్తే, లక్షల కోట్ల అప్పులు మిగిల్చారన్నారు. పదేళ్లు దోచుకున్నది చాలక ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టోలో చెప్పడానికి ఏముందన్నారు. వాళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్మరన్నారు. బీజేపీ స్టీరింగ్ అదానీ చేతిలో, బీఆర్ఎస్ స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉందన్నారు. బీజేపీ వీళ్లకు అవినీతి నుంచి రక్షణ కల్పిస్తోందన్నారు. బీజేపీ (BJP), బీఆర్ఎస్ ఇద్దరూ కలిసే ఉన్నారని ప్రజలకు అర్థం అయిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళ మధ్య అవగాహన కుదిరిందన్నారు. బాండ్ పేపర్ మీద రాసిచ్చిన వ్యక్తి పసుపు బోర్డు ఎక్కడ పెడతారో చెప్పాలని ప్రశ్నించారు. అన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతున్నాయిన్నారు రేవంత్‌రెడ్డి (Revanth reddy) .

ALSO READ: కాంగ్రెస్‌ సంచలన హామీ..పెళ్లి సమయంలో ఆడపిల్లలకు తులం బంగారం..!

CLICK HERE TO VIEW RTV WHATSAPP CHANNEL

Advertisment
Advertisment
తాజా కథనాలు