వాస్తవం, ధైర్యానికి రాహుల్ గాంధీ ఓ చిహ్నంగా మారారు...! మోడీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో సుప్రీం కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. దీనిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. రాహుల్ గాంధీపై బీజేపీ కుట్రలు బయటపడ్డాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ సర్కార్ విఫలమైందన్నారు. ఏ పనులు చేయాలని ప్రజలు ఎన్నుకున్నారో ఆ పనులను మోడీ సర్కార్, బీజేపీ నేతలు చేయాలని సూచించారు. By G Ramu 04 Aug 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి మోడీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో సుప్రీం కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. దీనిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. రాహుల్ గాంధీపై బీజేపీ కుట్రలు బయటపడ్డాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ సర్కార్ విఫలమైందన్నారు. ఏ పనులు చేయాలని ప్రజలు ఎన్నుకున్నారో ఆ పనులను మోడీ సర్కార్, బీజేపీ నేతలు చేయాలని సూచించారు. సుప్రీం కోర్టు తీర్పును ఖర్గే ప్రశంసించారు. సత్యమేవ జయతే అని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పారు. వయనాడ్ ప్రజలు గెలిచారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం అనే దేవాలయంలో సామాన్య ప్రజల గొంతు మరోసారి ప్రతిధ్వనిస్తుందన్నారు. వాస్తవం, ధైర్యానికి రాహుల్ గాంధీ ఓ చిహ్నంగా మారారని ట్వీట్ చేశారు. ప్రజల సమస్యలపై పార్లమెంటు వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. తమ మార్గం స్పష్టంగా వుందన్నారు. తాను ఏం చేయాలో అనే విషయంలో చాలా స్పష్టంగా వున్నట్టు వెల్లడించారు. తనకు మద్దతుగా నిలిచిన వారందని ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘మోడీ ఇంటి పేరు’కేసులో పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ దొరికింది. ఈ కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. రాహుల్ గాంధీకి విధించిన రెండేండ్ల శిక్షపై స్టే విధిస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. రాహుల గాంధీకి గరిష్ట శిక్ష విధించిన విషయంలో సరైన కారణం చూపించ లేకపోయిందని తెలిపింది. #rahul-gandhi #modi #supreme-court #mallikarjuna-kharge #modi-surname #defamation మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి