వాస్తవం, ధైర్యానికి రాహుల్ గాంధీ ఓ చిహ్నంగా మారారు...!
మోడీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో సుప్రీం కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. దీనిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. రాహుల్ గాంధీపై బీజేపీ కుట్రలు బయటపడ్డాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ సర్కార్ విఫలమైందన్నారు. ఏ పనులు చేయాలని ప్రజలు ఎన్నుకున్నారో ఆ పనులను మోడీ సర్కార్, బీజేపీ నేతలు చేయాలని సూచించారు.