Donald Trump Job Offer To Musk : సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X) లో అమెరికా మాజీ అధ్యక్షుడు , రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ను ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) తాజాగా ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్వ్యూలో భాగంగా ట్రంప్ కు మస్క్ పలు ప్రశ్నలు సంధించారు. అయితే ట్రంప్ కూడా అంతే ధీటుగా వాటికి జవాబిచ్చారు.
ఆ తర్వాత ట్రంప్ మస్క్ కు జాబ్ ని ఆఫర్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా కోరారు. తమ ప్రభుత్వం చేసే వివిధ ఖర్చులను నియంత్రించే బాధ్యతను మస్క్ తీసుకోవాలన్నారు. ఎస్క్ తో పాటు మస్క్ కంపెనీలలో కాస్ట్ కట్టింగ్ చాలా ప్రభావవంతంగా ఉందని, ఖర్చులను నియంత్రించడంలో మస్క్ గొప్ప నిపుణుడని ట్రంప్ ఈ సందర్భంగా కొనియాడారు.
ఈ విషయం గుర్తించాను కాబట్టే మస్క్ కు జాబ్ ఆఫర్ చేసినట్లు వివరించారు. టాక్స్ పేయర్ల నుంచి ప్రభుత్వానికి చేరే నగదును జాగ్రత్తగా వినియోగించాలనేదే తన అభిమతమని, టాక్స్ పేయర్ల కష్టార్జితాన్ని వృథా చేయడం తనకు ఇష్టం లేదని ట్రంప్ వివరించారు. మస్క్ కనుక ఈ బాధ్యతను స్వీకరిస్తే అమెరికాకు గొప్ప ప్రయోజనం చేకూరుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ట్రంప్ ఆఫర్ కు మస్క్ ఏ సమాధానం ఇవ్వకపోయినప్పటికీ దీని గురించి మాత్రం ఇద్దరి మధ్య ఇప్పటికే చర్చ జరిగినట్లు సమాచారం.
Also Read: 28 దీవులను భారత్ కి అప్పగించిన మాల్దీవులు!