Israel-Iran War: పశ్చిమాసియాలో యుద్ధం!.. ఇరాన్‌కు సాయం చేస్తోన్న తుర్కియే

ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఏకమవుతున్నాయి. ఇప్పటికే ఇరాన్‌ దగ్గర ఇజ్రాయెల్‌కు సంబంధించిన వెదర్‌ డేటా ఉంది. దీంతో తుర్కియేనే తమ వెదర్ డేటా లీక్ చేసిందంటూ ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇప్పటికే రష్యా.. ఇరాన్‌కు ఇస్కందర్ మిస్సైళ్లను పంపించింది.

New Update
Israel-Iran War: పశ్చిమాసియాలో యుద్ధం!.. ఇరాన్‌కు సాయం చేస్తోన్న తుర్కియే

పశ్చిమాసియాలో యుద్ధం కీలక దశకు చేరుకుంది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఏకమవుతున్నాయి. మరోవైపు నాటో దేశాల్లో కూడా ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత పెరుగుతోంది. ఇక ఇరాన్‌కు రహస్యంగా నాటో దేశమైన తుర్కియే సాయం చేస్తోంది. ఇప్పటికే ఇరాన్‌ దగ్గర ఇజ్రాయెల్‌కు సంబంధించిన వెదర్‌ డేటా అందుబాటులో ఉంది. దీంతో తుర్కియేనే తమ వెదర్ డేటా లీక్ చేసిందంటూ ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.

Also Read: తైవాన్‌లో భారీ భూకంపం.. భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీసిన ప్రజలు!

దీంతో డేటా ఆధారంగా ఇజ్రాయెల్.. మిలటరీ ఆపరేషన్స్‌ ప్లాన్ చేసుకుంటోంది. మరోవైపు ఇజ్రాయెల్ యుద్ధ ప్రణాళికను ఎదుర్కొనేందుకు ఇరాన్ కూడా సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఇరాన్‌కు రష్యా.. ఇస్కందర్ మిస్సైళ్ల వ్యవస్థను పంపించింది. ఈ మిసైల్స్ న్యూక్లియర్ వార్ హెడ్స్‌ను మోసుకెళ్లగలుగుతాయి. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. 10 నెలల్లోనే 40 వేల మందికి పైగా మృతి చెందారు. శవాలను పూడ్చడానికి కూడా కనీసం స్థలం లేని పరిస్థితి నెలకొంది. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Also Read: శాస్త్రవేత్త డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ ఎలా అగ్ని క్షిపణి పితామహుడు అయ్యారు?

Advertisment
తాజా కథనాలు