National : పెళ్ళి ఊరేంగిపుపై దూసుకెళ్ళిన ట్రక్.. ఐదుగురు మృతి

సంతోషంగా పెళ్ళి ఊరేగింపు జరుగుతోంది. అందరూ ఆనందంగా డాన్స్ చేస్తున్నారు. కానీ ఇంతలోనే ఓ ట్రక్కు ఊరేగింపు మీదకు దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 11మందికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిందీ ఘటన.

Gujarat: పండుగ వేళ విషాదం.. 10 మంది మృతి!
New Update

Accident in Madhya Pradesh : మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) లోని రాయిసేన్ జిల్లాలో ఘోర ప్రమాదం(Road Accident) జరిగింది. నిన్న రాత్రి సుల్తాన్‌పూర్‌(Sulthanpur) ప్రాంతంలో ఓ పెళ్ళి ఊరేగింపు జరుగుతోంది. ఆ సమయంలో ఓ ట్రక్కు(Truck) అదుపు తప్పి జనం మీదకు దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో కూడా మరో ఐదుగురి పరిస్థితి విషయమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Also Read : రాత్రి సమయంలో రోడ్డుపై వెళ్లేటప్పుడు ఈ కలర్ డ్రెస్ లు వేసుకుంటే డేంజర్..!

అదుపు తప్పిన ట్రక్కు...

హోసంగాబాద్ నుంచి పిపరియా గ్రామం మధ్యలో ఉన్న జాతీయ రహదారి(National Highway) మీదుగా పెళ్ళి ఊరేగింపు వెళుతోంది. ఇంతలో వేగంగా దూసుకువచ్చిన ట్రక్కు జనాలను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ట్రక్కు ఎందుకు అంత వేగంగా వచ్చిందో ఢీకొట్టిందో కారణాలు ఇంకా తెలియలేదు. చనిపోయిన వారిలో పెళ్ళి బంధువులు కన్నా... ఊరేగింపులో లైట్లు మోయడానికి వచ్చినవారే ఎక్కువగా ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మృతుల కుటుంబాలకు కలెక్టర్ అరవింద్ దూబే 4 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ.50,000 ఆర్ధిక సహాయం ఇచ్చారు.

Also Read : మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థిని  హర్షిత కాళ్లపైనుంచి వెళ్లిన లారీ

#road-accident #wedding #madhya-pradesh #truck
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe