Trivikram Srinivas : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఈ సంక్రాంతికి సందడి చేయనున్న అవుట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ గుంటూరు కారం (Guntur Kaaram). ఈ సినిమా స్టార్ట్ అయిన నాటి నుంచి అప్పటి వరకు సోషల్ మీడియాలో ఎన్నో వివాదాలు ఎదుర్కొంది.ఇప్పుడు తాజాగా మరో వివాదాస్పద అంశం తెరపైకి వచ్చింది. అదే .. గుంటూరు కారం మూవీ యద్దనపూడి సులోచనా రాణి రాసిన కీర్తి కిరీటాలు నవలను (Keerthi Kireetalu Novel) కాపీ చేసారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మాటకొస్తే .. త్రివిక్రమ్ కు కాపీ కథలు కొత్తేమీ కాదు. ఒకరకంగా త్రివిక్రమ్ కు కాపీ జానర్ కలిసొచ్చే అంశమే.
అ ఆ, అల .. వైకుంఠపురం లో, అతడు , అజ్ఞాతవాసి
గతంలో నితిన్, సమంత కాంబోలో వచ్చిన అఆ మూవీ అలనాటి మీనా సినిమాకు కాపీ అని అందరికి తెల్సిందే. ఈ మీనా మూవీ సైతం యద్దనపూడి నవల కావడం విశేషం.విజయనిర్మల డైరెక్షన్లో వచ్చిన మొదటి చిత్రం మీనా ను ఇప్పటి ట్రెండ్ కు అనుగుణంగా మలిచి అఆ మూవీని తెరకెక్కించారు గురూజీ. అఆ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.
ఇక..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) బ్లాక్బస్టర్ హిట్ అల .. వైకుంఠపురం లో (Ala Vaikunthapurramuloo) మూవీ గురించి చెప్పాల్సి వస్తే ఒకసారి అన్నగారు ఎన్టీఆర్ నటించిన ఇంటిగుట్టు సినిమా చూస్తే అర్ధం అవుతుంది. ఇక.. సూపర్ స్టార్ మహేష్ బాబు అతడు సినిమాపై యద్దనపూడి నవల పార్ధు ప్రభావం కనిపిస్తుంది. హీరో పేరు సైతం పార్ధు అని పెట్టారంటే ఆయనపై యద్దనపూడి రచనల ప్రభావం చాలా ఉంది. అతడు మూవీలో చిన్న పిల్లల స్మశానం సీన్ అయితే రచయిత మధుబాబు రియల్ లైఫ్ ఇన్సిడెంట్ లో జరిగింది ఈ సీన్ ను మధుబాబుకు చెప్పి మరీ ఆ సీన్ సినిమాలో పెట్టుకున్నారు త్రివిక్రమ్. ఈ సీన్ అతడు సినిమాకు చాలా కీలకంగా నిలిచింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేసిన అజ్ఞాతవాసి విషయంలోనూ హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టేశారంటూ విమర్శలు వచ్చాయి.
ALSO READ:kanyashulkam web series :మధుర వాణిగా అంజలి .. వేదంలో అనుష్క ను మరిపిస్తుందా ?
అదే నిజమైతే .. గుంటూరు కారం పక్కా హిట్
ఇక.. ఇప్పుడు వైరల్ అవుతోన్న వార్త విషయానికి వస్తే .. గుంటూరు కారం మూవీ యద్దనపూడి రాసిన కీర్తికిరీటాలు మూవీ స్టోరీ లైన్ తీసుకున్నారంటూ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సెంటిమెంట్ ప్రకారం చూస్కుంటే గుంటూరు కారం పక్కా హిట్ అని చెప్పొచ్చు . నిజానికి ఎవరయినా ఏ నవలనుంచైనా స్ఫూర్తి పొందవచ్చు. ఆ నవలల్లో పాత్రల్ని ఇప్పటి ట్రెండ్ కు అనుగుణంగా ఎక్కడా మిస్ ఫైర్ కాకుండా తెరకెక్కించే సత్తా ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ అని అందరికీ తెలుసు. ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన పాపులర్ నవల కీర్తికిరీటాలు స్టోరీలైన్ కాపీ చేసినా ఎలాంటి కాపీ వివాదాలు లేకుండా త్రివిక్రమ్ ముందు జాగ్రత్త తీసుకునే ఉంటారు.మదర్ సెంటిమెంట్ తో ఎన్నో భావోద్వేగాల సమ్మేళనంతో నడిచిన పాపులర్ నవల కీర్తి కిరీటాలు నుంచి నిజంగా కాపీ చేస్తే మాత్రం గుంటూరు కారం హిట్ ఘాటు మాములుగా ఉండదు. చూడాలి మరి .. ఈ విషయంపై గురూజీ ఎలా స్పంధిస్తారో .మొత్తానికి ఈ కాపీ టాపిక్ గుంటూరు కారం మూవీకి సరికొత్త బజ్ క్రియేట్ చేసిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. త్రివిక్రమ్ నా మజాకా
ALSO READ: మహేష్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. మహేష్ కు ముగ్గురు ముద్దుగుమ్మలను సెట్ చేసిన జక్కన్న