ఆగస్టు 1 నుంచి తెలుగు దేశం పార్టీ (tdp) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Achchennaidu) తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) అవినీతి, అధికార మత్తులో ఉండి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు, సాగు నీరు, వ్యవసాయరంగాలను పూర్తిగా భ్రష్టు పట్టించారని విమర్శించారు. దేశానికి అన్నంపెట్టే రైతులు ప్రస్తుత పరిస్థితులను చూసి వ్యవసాయాన్ని వదిలేసి పంటలు పండిచకపోవడమే మంచిదనే ఉద్దేశంతో కూలీ పనులకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పంటలు పండించకుండా చేసింది జగన్ మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. జగన్ వైఫల్యాలను ఎత్తి చూపడానికే వచ్చే నెల 1 నుంచి 10వ తేదీ వరకు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లబోతున్నారని చెప్పారు
వ్యవసాయరంగం బాగుపడాలంటే సాగునీటి ప్రాజెక్టులు కీలకమనే విషయం సీఎం జగన్(CM Jagan)కు తెలియక పోవడం బాధాకరమన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారని అవి 2019లో 80 శాతం వరకు పూర్తయ్యాయన్నారు, కానీ జగన్ మాత్రం ఈ నాలుగేళ్లలో మిగిలిన 20 శాతం పనులను కూడా పూర్తి చేయలేక పోయారన్నారు. ఏపీలో 69 నదులు ఉండటం రైతాంగానికి ఎంతో ఉపయోగకరమన్న ఆయన.. ప్రభుత్వం రైతాంగానికి ఉపయోగకరమైన విషయాలన్ను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి లాంటి ప్రధాన నదులున్నా రాష్ట్రంలో ఎందుకు సాగు పెరగడం లేదని అచ్చెన్నాయుడు (Achchennaidu) ప్రశ్నించారు.
రాష్ట్రంలో దోపిడీ, ఎదురుదాడి, హత్యా రాజకీయాలు చేస్తున్న జగన్ అభివృద్ధి, సంక్షేమం పథకాలను అటకెక్కించాలరని విమర్శించారు. కాగా తన సొంత నియోజకవర్గంలో ఉన్న కాలువలకు పూడికలు తీయలేని అంబటి రాంబాబు (ambati Rambabu) ప్రాజెక్టుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో ప్రాజెక్టులకు చంద్రబాబు నాయుడు 62 వేల కోట్లు ఖర్చు పెడితే జగన్ మాత్రం 22 వేల కోట్లతో సరిపెట్టారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో స్వర్గీయ ఎన్‌టీఆర్ (ntr) సాగునీటి ప్రాజెక్టులకు బీజంవేస్తే, చంద్రబాబు (Chandrababu Naidu) కొత్త ప్రాజెక్టులను నిర్మించి సాగు విస్తీర్ణం పెంచారన్నారు. పోలవరంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల స్థితిగతుల్ని చంద్రబాబు మీడియా సాక్షిగా ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచారని, దమ్ముంటే ఈ నాలుగేళ్లలో జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారో చెప్పాలని సవాల్ చేశారు.