PM Modi: ప్రధాని మోదీపై పోటీ చేయనున్న ప్రముఖ ట్రాన్స్‌జెండర్‌

ప్రధాని మోదీ ఈసారి కూడా లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. ఈయనకు పోటిగా.. అఖిల భారత హిందూ మహాసభ (ఏబీహెచ్‌ఎం).. ప్రముఖ ట్రాన్స్‌జెండర్‌, శ్రీకృష్టుడి పరమ భక్తురాలు 'మహామండలేశ్వర్‌ హేమాంగి సఖి మా' ను ప్రధాని మోదీపై తమ అభ్యర్థిగా నిలబెట్టింది.

PM Modi: ప్రధాని మోదీపై పోటీ చేయనున్న ప్రముఖ ట్రాన్స్‌జెండర్‌
New Update

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష నేతలు ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయారు. ఈసారి జరగనున్న లోకసభ ఎన్నికల్లో ప్రధాని మోదీ గతంలో లాగే.. వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. అయితే ఆయనకు పోటీగా ప్రముఖ ట్రాన్స్‌జెండర్‌, శ్రీకృష్టుడి పరమ భక్తురాలు 'మహామండలేశ్వర్‌ హేమాంగి సఖి మా' పోటీ చేయనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న 80 స్థానాల్లో.. 20 లోక్‌సభ స్థానాలకు అఖిల భారత హిందూ మహాసభ (ఏబీహెచ్‌ఎం) పోటీ చేయనుంది. ఈ పార్టీయే హేమాంగి సఖిని మోదీపై తమ అభ్యర్థిగా నిలబెట్టింది.

Also Read: నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ కస్టడీ.. మళ్లీ పొడగిస్తారా ?

మరోవైపు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్ మరోసారి పోటీ చేయనున్నారు. జూన్ 1న వారణాసిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక హేమాంగి సఖి విషయానికొస్తే.. ఆమె భగవద్గీతను ప్రపంచంలో అనర్గళంగా బోధించగలిగే తొలి ట్రాన్స్‌జెండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె గుజరాత్‌లోని బరోడాలో జన్మించారు. హేమాంగి తండ్రి ఓ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ కావండతో ఆమె కుటుంబం ముంబయికి వలస వెళ్లిపోయింది.

2019లో హేమాంగి సఖి ఆచార్య మహామండలేశ్వర్ గా పట్టాభిషిక్తులయ్యారు. హిందూత్వ భావాలు పుష్కలంగా ఉన్న ఆమె.. పురాతన ఆధ్యాత్మిక నిలయమైన వారణాసి నుంచి పోటీ చేయడం అందరినీ ఆలోచింపచేస్తోంది. ఆమె పోటీ చేయడం వల్ల.. హిందూత్వ నినాదంతో ముందుకెళ్తున్న బీజేపీకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనే చర్చ నడుస్తోంది. ఇప్పటిదాకా రెండు ఎన్నికల్లోనూ నరేంద్ర మోదీకి ప్రధాన పోటీదారులుగా ఉన్న ఆప్ కానీ ఎస్పీ కానీ సెక్యూలర్ భావజాలంతో ఎన్నికల బరిలోకి దిగి ఓడిపోయారు. అయితే ఇప్పుడు హిందూ మహా సభ.. బీజేపీకి పోటీగా అభ్యర్ధిని పెట్టడం అందులో హేమాంగి సఖి మాత వంటి వారు పోటీ చేయడంపై ఆసక్తి నెలకొంది.

ఇక ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మే 13న జరగనున్నాయి. జూన్‌ 4 న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఓవైపు మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ.. మరోవైపు మోదీ సర్కార్‌ను గద్దె దించాలని ఇండియా కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈసారి ప్రజలు.. కేంద్రలో ఎవరికి అధికారం అప్పగిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

Also Read: మోడీజీ.. హోదాకు తగ్గట్లు నడుచుకోండి: ప్రధానిపై మమత విమర్శలు!

#telugu-news #varanasi #2024-lok-sabha-elections #pm-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe