TPCC press meet:ఆ అధికారులను వెంటనే తొలగించండి: రేవంత్ రెడ్డి సంచలన డిమాండ్

సంక్షేమ పథకాల నగదు బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని నిన్న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. నవంబర్ 2లోగా అన్ని పూర్తి చేయాలని చెప్పామన్నారు. రిటైర్ అధికారులతో నయా రాజాకార్ ఆర్మీని కేసీఆర్ నియమించుకున్నారు.కొందరు అధికారులు బీఆరెస్ ఎన్నికల నిర్వహణ టీమ్ లా పనిచేస్తున్నారనివారిని వెంటనే తొలగించాలని ఈసీని కోరామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి, ఉత్తమ్, భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

TPCC press meet:ఆ అధికారులను వెంటనే తొలగించండి: రేవంత్ రెడ్డి సంచలన డిమాండ్
New Update

పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని మేం చెబుతుంటే.. బీఆరెస్ మాపై విష ప్రచారానికి దిగిందని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సంక్షేమ పథకాల చెల్లింపులు నవంబర్ 2 లోగా విడుదల చేయాలి.ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్దిష్టమైన డిమాండ్ అని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని ఈసీకి కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఒకవేళ కేసీఆర్ చెల్లింపులు వాయిదా వేస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెల్లిస్తుంది.సంక్షేమ పథకాల నగదు బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని నిన్న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. నవంబర్ 2లోగా అన్ని పూర్తి చేయాలని చెప్పామన్నారు.కాంగ్రెస్ ను బూచిగా చూపి కేసీఆర్ చెల్లింపులు ఆపాలని చూస్తున్నారు. రిటైర్ అధికారులతో నయా రాజాకార్ ఆర్మీని కేసీఆర్ నియమించుకున్నారు.కొందరు అధికారులు బీఆరెస్ ఎన్నికల నిర్వహణ టీమ్ లా పనిచేస్తున్నారనివారిని వెంటనే తొలగించాలని ఈసీని కోరామని చెప్పారు. అంజనీ కుమార్ ను, స్టీఫెన్ రవీంద్రను బదిలీ చేయాలని స్పష్టంగా చెప్పాం. రిటైర్ అధికారులను తక్షణమే తొలగించాలని చెప్పామని అన్నారు రేవంత్ రెడ్డి.

Also Read:రెండు రోజులుగా నష్టాలో దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు

కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేసినా....బీఆరెస్ ను ఓటమి నుంచి ఎవరూ కాపాడలేరని అన్నారు రేవంత్ రెడ్డి. మళ్లీ కేసీఆర్ మాయలో పడేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. కేసీఆర్‌ ఏ మాట చెప్పినా అమలు చేయడని రేవంత్ విమర్శించారు. మేం ఏదో పథకాల్ని ఆపేయాలని కుట్ర చేస్తున్నట్లు... మాపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.నాణ్యతాలోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయి.డ్యామ్ సేఫ్టీ అధికారులు నివేదికను నివేదికను బయటపెట్టడం లేదని రేవంత్ మండిపడ్డారు. మేడిగడ్డ కాదు.. కేసీఆర్ ప్రభుత్వం కుంగిపోయే పరిస్థితి వచ్చింది.మేడిగడ్డలో బాంబులు పెడితే బ్రిడ్జి కిందకు కూలుతుందా...బాంబులు పెడితే పేలుడు జరగాలి కదా...ఇంత చిన్న విషయం కూడా కేసీఆర్ కు తెలియలేదని విమర్శించారు.

హరీష్ కేటీఆర్ బిల్లా రంగా లాంటివారు..కేసీఆర్ చార్లెస్ శోభారాజ్ లాంటి వారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. బీజెపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు తోడు దొంగలని మండిపడ్డారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని...అందుకే తాను ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాని చెప్పారు రేవంత్. తెలంగాణ ప్రజలు ఈ సారి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పగ్గలు అప్పగించరని ఆయన అన్నారు. కేసీఆర్, కేటీఆర్ లను చిత్తు చిత్తుగా ఓడించడానికి తాము రెడీగా ఉన్నామని రేవంత్ చెప్పారు. ప్రతీ పాడెక్ట్ కు టైమ్ లైన్ ఉంటుంది. అలాగే కేసీఆర్ టైమ్ కూడా అయిపోయిందని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఈ సారి కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంటు వచ్చినట్టు తెలంగాణలోకి కూడా వస్తుందని రేవంత్ బల్ల గుద్ది మరీ చెప్పారు.

#revanth-reddy #tpcc #press-meet #delhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe