Group-1: రేపే గ్రూప్ 1 ప్రిలిమ్స్.. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే తెలంగాణలో ఆదివారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. రేపు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు ఉదయం 10 గంటలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు చెప్పారు.ఒక్క నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించమని పేర్కొన్నారు. By B Aravind 08 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో ఆదివారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. రేపు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు ఉదయం 10 గంటలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు చెప్పారు. 10.00 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా పరీక్ష కేంద్రంలోకి పర్మిషన్ ఇవ్వమని పేర్కొన్నారు. 561 పోస్టులకు మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే. Also Read: రామోజీరావు కన్నుమూత.. నివాళులర్పిస్తున్న ప్రముఖులు! 1. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు బూట్లు వేసుకొని రాకూడదు. చెప్పులు మాత్రమే వేసుకోలి. 2. బయోమెట్రిక్ వేలిముద్ర వివరాల రికార్డింగ్ ఉన్నందున అభ్యర్థులు తమ వేళ్లపై మెహందీ లేదా ఇతర ప్రింటెడ్ రంగులు ఉంచుకోకూడదు. 3. కాలిక్యులేటర్, ఫేజర్, సెల్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు, గడియరాలు వెంట తీసుకురావం నిషేధం. 4. లాగ్‌బుక్‌లు, లాగ్ టేబుల్‌లు, వాలెట్‌లు,హ్యాండ్‌బ్యాగ్‌లు, పౌచ్‌లు, ఆభరణాలు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు తీసుకురావద్దు. 5. హాల్‌టికెట్, ఐడీకార్డు తప్పకుండా వెంట తెచ్చుకోవాలి. హాల్ టికెట్ ఫొటో సరిగా లేనట్లైతే మరోక ఫొటోను తీసుకురావాలి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. Also Read: కోరిక తీర్చలేదని మాటువేసి వేటు వేశాడు ఇదిలాఉండగా.. మరోవైపు ఆదివారం జరగబోయే గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని.. పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అదే రోజున ఇంటెలిజెన్స్ బ్యూరో పరీక్ష కూడా ఉందని.. చాలామంది నిరుద్యోగులు ఈ పరీక్ష రాస్తున్నారని పేర్కొన్నారు. 6వేల పోస్టుల భర్తీకి ఈ పరీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. #telugu-news #telangana #group-1 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి