T20 World Cup : పవన్ నుంచి మహేష్ వరకు.. వరల్డ్ కప్ విన్నింగ్ పై టాలీవుడ్ తారల విషెస్..!

శనివారం ఇండియా - సౌత్ ఆఫ్రికా మధ్య T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఇండియా సౌత్ ఆఫ్రికాపై 7 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా తమ అభినందనలు తెలిపారు.

T20 World Cup : పవన్ నుంచి మహేష్ వరకు.. వరల్డ్ కప్ విన్నింగ్ పై టాలీవుడ్ తారల విషెస్..!
New Update

Tollywood Celebrities Wishes To Team India : T20 వరల్డ్ కప్ ఫైనల్స్ (T20 World Cup Finals) లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించి ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది. 17 ఏళ్ళ తర్వాత రెండో సారి వరల్డ్ కప్ గెలవడంతో యావత్ దేశం గర్విస్తోంది. ఈ క్రమంలోనే సామాన్యుల నుంచి సినీ,రాజకీయ ప్రముఖుల దాకా భారత జట్టుపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో భాగంగానే టాలీవుడ్ సినీ తారలంతా సోషల్ మీడియా వేదికగా తమ అభినందనలు తెలుపుతున్నారు.

సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీమిండియాకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. " విశ్వ విజేతలకు అభినందనలు రెండవ సారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలచిన భారత జట్టుకు అభినందనలు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలచిపోతుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తుది పోరులో జట్టు మొత్తం సమష్టిగా రాణించిన తీరు అద్భుతం. ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఒత్తిడిని జయంచి సగర్వంగా ప్రపంచకప్ సాధించి పెట్టిన భారత క్రికెటర్లకు పేరు పేరునా హృదయ పూర్వక శుభాకాంక్షలు. మీ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి దాయకం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ క్రికెట్ లో భారత్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ పోస్ట్ పెట్టారు.

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు టీమిండియా (Team India) కు శుభాకాంక్షలు తెలిపారు. 'ఈ రోజు మనదే.. హీరోస్-ఇన్-బ్లూ.. కొత్త ప్రపంచ ఛాంపియన్స్.. సూర్యకుమార్‌ క్యాచ్‌ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ చారిత్రాత్మక విజయం పట్ల చాలా గర్వంగా ఉంది. జై హింద్‌' అంటూ పోస్ట్ చేశారు.

Also Read : టీమిండియాలో ఇద్దరూ ఇద్దరే! భారత క్రికెట్ చరిత్రలో పరుగుల పేజీలు వారివే!

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) విన్నింగ్‌ మూమెంట్‌ ఫోటోను ట్విటర్‌లో పంచుకున్నారు. కోచ్ రాహుల్ ద్రావిడ్‌ (Rahul Dravid) ను హత్తుకున్న ఫోటోను పోస్ట్ చేశారు.

ఈ అద్భుతమైన విజయాన్ని గుర్తుండిపోయేలా చేసిన టీమిండియాకు, రోహిత్ శర్మ (Rohit Sharma) కు నా ప్రత్యేక అభినందనలు అంటూ గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్‌ సోషల్ మీడియా వేదికగా అభినందలు తెలిపారు.


టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు నా అభినందనలు అంటూ అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశారు.

#mahesh-babu #rajamouli #tollywood-celebrities #t20-wold-cup-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe