Gold Rate Today: బంగారానికి రెక్కలు విరిగినట్లున్నయ్...మొన్నటివరకు కొండెక్కి కూర్చున్న ధరలు గత పదిరోజులుగా పతనమౌతూ వస్తున్నాయి. ఒక్కరకంగా ఇది మహిళలకు సంతోషాన్నిచ్చే వార్తే. అయినప్పటికీ బంగారంపై ఎందుకంత మోజు తగ్గుతుంది. రానున్న కాలంలో ఇంకా తగ్గనుందా? లేదంటే వచ్చేది పండగలు, పెళ్లిళ్ల సీజన్ కాబట్టి అమాంతం పెరగనుందా? ఏది ఏమైనప్పటికీ మీరు బంగారం కొనుగోలు చేయాలన్న ప్లాన్ లో ఉంటే ఏమాత్రం చేయకుండా కొనేయ్యండి. కాగా ఈరోజు కూడా బంగారం ధర తగ్గింది. నేడు అక్టోబర్ 6వ తేదీ. ఈరోజు 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 56,560 ఉండగా...22క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ. 51,800 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్థిరంగానే కొనసాగుతోంది.
కాగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి. పెరిగాయా ? లేదా తగ్గాయా? ఓసారి చూద్దాం.
ఢిల్లీలో...
24క్యారెట్ల పది గ్రాములు రూ. 57,310
22 క్యారెట్లు రూ. 52,550
కోల్ కతాలో...
24క్యారెట్లు పది గ్రాములు ధర రూ. 57,160
22క్యారెట్లు పది గ్రాములు ధర రూ. 52,400
ముంబైలో...
24క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 57,160.
22క్యారెట్ల ధర రూ. 52,400
చెన్నైలో...
24క్యారెట్ల ధర రూ. 55,600
22క్యారెట్ల ధర రూ. 52,950
కేజి వెండి ధర రూ. 200తగ్గింది.
ఢిల్లీలో రూ. 71,100 పలుకుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి(Gold Rate Today in AP & Telangana)
విజయవాడలో 10 గ్రాములపై 150రూపాయలు తగ్గింది.
24క్యారెట్లపై రూ. 170 తగ్గింది.
కిలో వెండి రూ. 73,500
హైదరాబాద్ లోనూ బంగారం ధర తగ్గింది.
22క్యారెట్ల 10 గ్రాముల బంగారం దర రూ. 200తగ్గింది. ప్రస్తుతం 52,390 ఉంది.
24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 170 తగ్గగా...57,150 పలుకుతోంది.
కిలో వెండి ధర రూ. 73,500 ఉంది.