Karimnagar : నేడే పందెం కోడి వేలం.. చరిత్రలో నిలిచిపోనున్న కరీంనగర్

జనవరి 09న కరీంనగర్-సిరిసిల్ల బస్ లో దొరికిన పందెం కోడి వేలం నేడు కరీంనగర్ డిపోలో మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఆసక్తిగలవారు ఈ వేలం పాటలో పాల్గొనాలని ఆర్టీసీ కోరడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఆర్టీసీకి ఈ కోడి ఎంత ఆదాయం తెస్తుందనే విషయం ఆసక్తికరంగామారింది.

New Update
Karimnagar : నేడే పందెం కోడి వేలం.. చరిత్రలో నిలిచిపోనున్న కరీంనగర్

Pandem Kodi : ఇటీవల బస్సులో దొరికిన పందెం కోడి(Pandem Kodi) విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కాగా ఈ కోడి వేలం నేడు కరీంనగర్‌(Karimnagar) బస్‌ డిపోలోనే జరగనుంది. ఈ సందర్భంగా ఆసక్తి గలవారు ఈ వేలంలో పాల్గొనాలంటూ ఏకంగా ఆర్టీసీ ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశమైంది.

publive-image

వరంగల్ - సిరిసిల్ల.. 
ఈ మేరకు జనవరి 09, టీఎస్‌ఆర్టీసీ బస్సు వరంగల్(Warangal) నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ(Vemulawada) ప్రయాణిస్తుండగా.. కరీంనగర్‌ బస్‌ స్టాప్‌లో ఆగింది. అయితే ఓ వ్యక్తి బస్సులో తన బ్యాగ్‌ మరిచిపోయి దిగిపోయినట్లు గుర్తించిన తోటి ప్రయాణికులు.. విషయాన్ని కండక్టర్‌ కు చెప్పారు. దీంతో వెంటనే ఈ బ్యాగ్‌ను కరీంనగర్‌ డిపోకు పంపించారు కండక్టర్. అయితే మరిచిపోయిన వ్యక్తి కరీంనగర్‌ జిల్లాలకు సంబంధించి ఉంటాడని భావించి ఎలాగైనా బ్యాగ్ కోసం వస్తాడని బస్టాండ్ లోనే మూడు రోజులు ఉంచారు. కానీ దానికోసం ఎవరూ రాకపోవడంతో ఆ బ్యాగు తెరిచి చూసిన అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

బ్యాగ్‌లో పందెం కోడి..
అందులో కొక్కరకో అంటూ ఓ కోడి కనిపించింది. అది కూడా మాముల కోడి కాదు.. బరిలో ప్రత్యర్థులను చిత్తు చేయాలనే కసితో ఉన్న పందెం కోడి. బస్సు సిబ్బందికి దాన్ని చూడగానే పాపం అనిపించి నీరసించిపోయిన కోడిని రక్షించారు. అయితే మూడు రోజులు గడిచిన బ్యాగ్‌ మరిచిపోయిన వ్యక్తి రాలేదు. మరోవైపు కోడిని చూసుకోవడం తమకు ఇబ్బందిగా మారింది. దీంతో మీడియా ప్రకటన చేసిన ఎవరూ స్పందించట్లేదు. ఈ క్రమంలోనే డిపో మేనేజర్, సిబ్బంది ఒక నిర్ణయానికి వచ్చారు.

ఇది కూడా చదవండి : lashkar-e-taiba:ముంబై 26/11 దాడుల సూత్రధారి మృతి

వేలం ప్రకటన..
ఆ పందెం కోడిని వేలం వెయాలనే ఆలోచనతో కసరత్తులు మొదలుపెట్టారు. సంస్థకు ఆదాయంతో పాటు కోడిని కూడా వదిలించుకునే అవకాశం ఇదేనని భావించి.. జనవరి 12న వేలం వేస్తున్నట్లు ప్రకటన జారీ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన నోట్ వైరల్ అవుతుండగా జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా ఈ రోజు సాయంత్రం పందెం కోడి లెక్క తేలనుండగా ఆర్టీసీకి ఎంత ఆదాయం వస్తుందోననే విషయం మాత్రం చర్చనీయాంశమైంది. ఇక మొదటిసారి కోడిని వేళం వేస్తున్న కరీంనగర్ డిపో చరిత్రలో నిలిచిపోనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు