Stock Markets Today:మంచిరోజు...లాభాల్లో స్టాక్ మార్కెట్

అంతర్జాతీయ మార్కెట్లోల సానుకూల సంకేతాలు ఉండటంతో ఈరోజు దేశీయ మార్కెట్లు లాబాల్లో నడుస్తున్నాయి. ఉదయం 9.25 గంటలకు సెన్సెక్స్ 375 పాయింట్ల లాభంతో 66454 దగ్గర, నిఫ్టీ 97 పాయింట్లు లాభపడి 19,800 కొనసాగుతున్నాయి.

New Update
Stock Markets Today:మంచిరోజు...లాభాల్లో స్టాక్ మార్కెట్

Stock Markets Today: నిన్నటి లాభాలు నేడు కూడా కంటిన్యూ అవుతున్నాయి. స్వల్ప లాభాలతో నిన్న ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా ఉదయం కూడా అదే ఊపును కొనసాగించాయి. దానికి తోడు ఈరోజు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా సానుకూలంగా కదలాడుతున్నాయి. అమెరికా మార్కెట్లు, ఐరోపా మార్కెట్లు కూడా ఇదే బాటలో ఉన్నాయి. ఉదయం దేశీయ మార్కెట్లు మొదలైన సమయానికి సెన్సెక్స్ (Sensex) 375 పాయింట్లు లాభంతో 66,454 దగ్గర, నిఫ్టీ (Nifty) 110 పాయింట్లు లాభపడి 19,800 దగ్గర ఉన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 83.22 దగ్గర ఉంది. సెన్సెక్స్ లో ఉండే 30 సూచీలు లాబాల్లోనే ఉన్నాయి. టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌అండ్టీ, విప్రో, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, ఏఎస్‌డబ్యల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, హెచ్యూఎల్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్ ఎక్కువగా లాభపడుతున్న షేర్లలో ఉన్నాయి.

ఇజ్రాయెల్ (Israel War) యుద్ధ భయం నుంచి మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నాయి. యద్ధం త్వరలోనే ముగుస్తుందన్న సంకేతంతో సూచీలు వేగంగా కదలాడుతున్నాయి. కానీ చమురు ధరలు మాత్రం ఇంకా దిగిరావడం లేదు. వాటి పెరుగుదల ఇంకా కలవరపెడుతూనే ఉన్నాయి. మంగళవారం బ్రెంట్ బ్యారెల్ చమురు ధర 87.91 డార్లకు చేరింది.మరోవైపు అమెరికా బాండ్‌ ఈల్డ్‌ తగ్గినప్పటికీ వడ్డీరేట్లు మరికొంతకాలం యథాతథంగా ఉండే అవకాశం ఉండటంతో మదుపరులు భారీగా నిధులు కుమ్మరించారు.

భారతీ ఎయిర్‌టెల్‌, కొటక్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌ల షేర్లు (Shares) రెండు శాతానికి పైగా పెరిగాయి.వీటితోపాటు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, మారుతి, టాటా స్టీల్‌, ఎస్బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీలు ఒక్కశాతంకు పైగా బలోపేతం అయ్యాయి.అలాగే పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌, నెస్లె, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్‌, ఎల్‌అండ్‌టీ, టైటాన్‌లు లాభపడ్డాయి.
కానీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌లు నష్టపోయాయి.బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 1.4 శాతం, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ 1.14 శాతం చొప్పున లాభపడ్డాయి.

Also Read:భారత్-పాక్ మ్యాచ్‌కు బీసీసీఐ హడావుడి..ప్రత్యేక కార్యక్రమం ప్లానింగ్

Advertisment
తాజా కథనాలు