Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి కాస్తంత ఊరట లభించింది. గతవారం రోజులు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు కాస్త స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. ఇవాళ ఉదయం 6 గంటల వరకు నమోదు అయిన వివరాల ప్రకారం..ప్రస్తుతం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ. 53,650గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,530 పలుకుతోంది. అదేవిధంగా వెండి కిలో ధర రూ. 500 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 72,100 పలుకుతోంది. కాగా నేడు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఏవిధంగా ట్రేడ్ అవుతున్నాయో ఓసారి చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు చూస్తే హైదరాబాద్ (Hyderabad) లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,650పలుకుతుండగా...24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,530గా నమోదు అయ్యింది. అటు విజయవాడలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,650 ఉండగా...24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,530 పలుకుతోంది. అటు విశాఖలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: చంద్రబాబు ఫైబర్‌నెట్ కేసులో పీటీ వారెంట్‌పై నేడు తీర్పు
ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో చూసినట్లయితే...
చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,720 ఉండగా..24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,600పలుకుతోంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 53,800ఉండగా...24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,680దగ్గర ట్రేడ్ అవుతోంది. కోలో కత్తాలోనూ ఇవే ధరలు ట్రేడ్ అవుతున్నాయి. బెంగుళూరు, కేరళలలోనై ఇవే ధరలు ఉన్నాయి.
అటు వెండి ధరలు చూస్తే...
హైదరాబాద్ లో 75వేలు ఉండగా విజయవాడ, విశాఖలోనూ ఇదే ధర ఉంది. ఢిల్లీలో 72,100గా ఉండగా కోల్ కతా, ముంబైలో నూ ఇదే ధరలకు అందుబాటులో ఉంది. బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 71,000ఉంది. చెన్నైలో 75వేలు పలుకుతోంది.
ఇది కూడా చదవండి: ప్రేక్షకులను పిచ్చోళ్లను చేసిన బిగ్ బాస్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజెన్లు.. అసలేమైందంటే?