/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-58-jpg.webp)
Praja Palana Application: తెలంగాణలో డిసెంబర్ 28న మొదలైన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ప్రజల నుంచి ప్రజాపాలన కార్యక్రమం (Praja Palana)పేరుతో దరఖాస్తులను స్వీకరిస్తుండగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మహాలక్ష్మి (Mahalaxmi Scheme), రైతు భరోసా, గృహ జ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల పథకాల కోసం పెద్ద ఎత్తున్న దరఖాస్తులు చేసుకుంటున్నారు.
విశేష స్పందన..
ఈ ప్రక్రియ మొదలైన మొదటి వారంలోనే కోటికిపైగా అప్లికేషన్స్ వచ్చాయని, ప్రజాపాలనకు విశేష స్పందన లభిస్తోందని అధికారులు తెలిపారు. అయితే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకూ అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకూ కోటి 8 లక్షల 49వేల కుటుంబాలకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో 6 గ్యారంటీల కోసం 93లక్షల 38వేల మంది దరఖాస్తు చేసుకోగా.. కొత్త రేషన్ కార్డు (Ration Card) కోసం 15లక్షల 55వేల మంది అప్లకేషన్స్ పెట్టుకున్నారు. ఇక ఇవాళ ఆఖరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చే ఛాన్స్ ఉందని, ఇందుకు సంబధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు, మండల ఆఫీసర్ లు చెప్పారు.
ఇది కూడా చదవండి : Nirmal: కవ్వాల్ టైగర్ రిజర్వు నుంచి గ్రామాల తరలింపునకు రంగం సిద్ధం
మళ్లీ 4నెలల తర్వాతే..
ఇదిలావుంటే.. ఇప్పటికి చాలా మంది ఈ పథకాలకు దరఖాస్తులు చేసుకోలేదని ఆందోళన చెంతుతున్నారు. ఈ పథకాలు పొందేందుకు కొత్త ఆధార్ కార్డు తీసుకోవాలా? కొత్తగా రైతు బంధు అప్లై చేయాలా? వద్దా? కరెంట్ బిల్లు మగవారి పేరు మీద ఉండలా? లేదా ఇంట్లోని మహిళల పేరు మీద ఉండలా? అనే సందేహాలతో ప్రజలు దరఖాస్తులు చేయలేదు. మరికొన్ని చోట్లల్లో దరఖాస్తులు ఫామ్స్ లేకపోవడం ప్రజలు ఇబ్బందుకు పడ్డారు.
గడువు పెంచాలని వినతులు..
రేపటితో దరఖాస్తులకు ఆఖరి తేదీ కావడంతో గడువు పెంచాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ఈ నెలలో మళ్లీ గడువు పెంచేది లేదని ప్రభుత్వం స్పష్టం చేయగా.. ప్రజల ఆందోళన చెందొద్దని అధికారులు చెబుతున్నారు. మళ్లీ 4నెలల తర్వాతే ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందని, ప్రజాపాలన ముగిసినా స్థానిక మండల ఆఫీసులో దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.