U19 World Cup : ICC అండర్ 19(ICC Under 19) క్రికెట్ వరల్డ్ ప్రపంచకప్ తుది(Cricket World Cup Final) సమరానికి సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్-ఆస్ట్రేలియా(Ind vs Aus) మధ్య నేడు ఫైనల్ పోరు జరగనుంది. ఇది భారత్‌కు వరుసగా అయిదో ఫైనల్ కాగా.. ఇరు జట్లు కప్ ఒడిసిపట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఆరుసార్లు విజేతగా నిలిచిన భారత్ కు ఆస్ట్రేలియాపై అద్భుతమైన రికార్డ్ కూడా ఉంది. 2012, 2018 రెండు సార్లు ఆస్ట్రేలియాను ఓడించి భారత్ కప్పును ముద్దాడింది. అంతేకాదు ఎప్పటిలాగే ఈ టోర్నమెంట్ లోనూ ఇండియా పూర్తి ఆధిపత్యం చెలాయించగా ఈసారి కప్ మనదే అంటున్నారు విశ్లేషకులు.
మధ్యాహ్నం 1:30 గంటలకు..
ఈ మేరకు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియాలు తలపడబోయే ఈ ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా(South Africa) బెనోనిలోని విల్లోమూర్ పార్క్(Villomur Park) లో జరగనుంది. బెనోనిలో ఉదయం 10:00 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. అంటే భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2 ఛానెల్స్ లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. భారతీయులు డిస్నీ+ హాట్‌స్టార్ లో ఈ మ్యాచ్ ఆస్వాదించవచ్చు.
తుది జట్ల అంచనా..
ఇండియా:
ఉదయ్ సహారన్ (c), ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, మురుగన్ అభిషేక్, అరవెల్లి అవనీష్ (wk), నమన్ తివారీ, రాజ్ లింబానీ, సౌమీ పాండే, ఆరాధ్య శుక్లా (ఇన్నేష్ మహాజన్, ఇన్నేష్ ), ధనుష్ గౌడ, రుద్ర పటేల్, ప్రేమ్ దేవ్కర్, మహమ్మద్ అమన్, అన్ష్ గోసాయి.
ఆస్ట్రేలియా:
హ్యూ వీబ్‌జెన్ (c), హ్యారీ డిక్సన్, సామ్ కాన్స్టాస్, హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్ (wk), ఆలివర్ పీక్, టామ్ కాంప్‌బెల్, రాఫ్ మాక్‌మిలన్, టామ్ స్ట్రాకర్, మహ్లీ బార్డ్‌మాన్, కల్లమ్ విడ్లర్, లచ్లాన్ ఐట్కెన్, చార్లీ ఆండర్సన్, హర్కిరత్ బజ్వా, కోరీ వాస్లీ, ఐడాన్ ఓ కానర్.
ఇది కూడా చదవండి : Relationship : శృంగారానికి లూబ్రికెంట్లను ఉపయోగిస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
అన్ని విభాగాల్లోనూ పటిష్ఠం..
ఇక యువ భారత్ అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ నిలకడగా రాణిస్తోంది. కెప్టెన్ ఉదయ్ సహారన్ ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. నాయకత్వ లక్షణాలతో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. సచిన్ దాస్ కూడా ఉత్తమ ఫామ్ కొనసాగిస్తున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ పరుగుల వేట కొనసాగిస్తున్నాడు. టోర్నీలో ప్రస్తుతం అత్యధిక పరుగుల వీరుల్లో తొలి మూడు స్థానాల్లో వరుసగా ఉదయ్ (389), ముషీర్ (338), సచిన్ (294) ఉండటం విశేషం. బౌలింగ్‌లో స్పిన్నర్ సౌమి పాండే (17), పేసర్ నమన్ తివారి (10) అద్భుతమైన ఫామ్ లో ఉండటం భారత్ కు కలిసొచ్చే అంశం.
ప్రత్యర్థి జట్టు బలంగానే..
అయితే ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియా కూడా బలంగానే కనిపిస్తోంది. కెప్టెన్ హ్యూ విబ్జెన్, ఓపెనర్ హ్యారీ డిక్సన్, పేసర్లు టామ్ స్ట్రాకర్, కలం విడ్లర్ ఆ జట్టులో ప్రధాన ఆటగాళ్లున్నారు. బ్యాటింగ్‌లో విబ్జెన్ (256), డిక్సన్ (267)లు సత్తా చాటుతున్నారు. వీరిద్దరికీ మన బౌలర్లు కళ్లెం వేస్తే ఆధిపత్యం చెలాయించొచ్చు. ఇక ఆసిస్ బౌలర్లు స్రేటకర్ (12), విడ్లర్ (12)సైతం భారత కుర్రాళ్లకు సవాల్ విసురుతున్నారు.
Also Read : Revanth Reddy: మద్యం మత్తు వదల్చాలి రేవంత్సర్కారు!