Atal Bihari Death Anniversary : నేడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) ఆయనకు నివాళులర్పించారు. ప్రధాని మోదీతోపాటు పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ప్రధాని మోదీ అటల్ బిహారీ వాజ్‌పేయిని స్మరించుకుంటూ ట్వీట్ చేశారు. “నేను.. 140 కోట్ల మంది భారతీయులతో పాటు, సాటిలేని అటల్ బిహారీ వాజ్‌పేయి జీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము. మీ నాయకత్వం వల్ల దేశం ఎంతో ప్రయోజనం పొందింది.” దేశాభివృద్ధిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో.. 21వ శతాబ్దంలో దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడంలో మీది ముఖ్యమైన పాత్ర అంటూ మోదీ ట్వీట్ చేశారు.
పూర్తిగా చదవండి..Atal Bihari Death Anniversary : నేడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి, నివాళులర్పించిన మోదీ, ప్రముఖులు..!!
నేడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ప్రధాని మోదీతోపాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. 1996లో తొలిసారిగా దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వాజ్‌పేయి... 1998, 1999 నుంచి 2004 వరకు ప్రధానిగా ఉన్నారు.
Translate this News: