T20 World Cup : ఈరోజే ఆరంభం..ఈరోజే ఐర్లాండ్‌తో భారత్ మొదటి మ్యాచ్

ప్రపంచకప్‌కు సమయం ఆసన్నమైంది. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఈరోజు మొదటి మ్యాచ్ ఆడనుంది. ఐర్లాండ్‌తో న్యూయార్క్‌లోని నాసౌవ్‌ కౌంటీ స్టేడియంలో రాత్రి 8 గంటలకు తలపడనుంది.

New Update
T20 World Cup : ఈరోజే ఆరంభం..ఈరోజే ఐర్లాండ్‌తో భారత్ మొదటి మ్యాచ్

India Vs Ireland : వన్డే వరల్డ్‌కప్‌ (T20 World Cup) ను చివరి నిమిషంలో చేయజార్చుకున్న టీమ్ ఇండియా (Team India) ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌ను ఎలా అయినా సాధించాలని పట్టుదలగా ఉంది. రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్‌గగా టీమ్ ఇండియా పోట్టి కప్ సమరానికి సన్నద్ధమైంది. ఈరోజే మొదటి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్‌ ఎలో భాగంగా టీమ్ ఇండియా ఈరోజు ఐర్లాండ్‌తో ఢీకొనబోతోంది. న్యూయార్క్‌లోని నాసౌవ్‌ కౌంటీ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్‌ యాప్‌లో లైవ్ మ్యాచ్ చూడొచ్చు.

భారత్‌తో పోల్చుకుంటే ఐర్లాండ్ చిన్న టీమ్. అలా అని ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. అంతకు ముందు భారత్‌తో ఆడినప్పుడు, మిగతా టీమ్‌ల మీద ఐర్లాండ్ జట్టు మంచి ప్రతిభ కనబరిచింది. చాలా టఫ్ ఫైట్‌ను ఇచ్చింది. చాలాపెద్ద జట్లకు షాక్ ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి ఐర్లాండ్ జట్టును తేలిగ్గా తీసుకోవడానికి వీలు లేదు. రోహిత్ సేన చాలా జాగ్రత్తగానే ఆడాలి. అందులోనూ న్యూయార్క్ పిచ్‌లు చాలా మెత్తగా ఉన్నాయని... ఆటగాళ్ళు దెబ్బలు తగలకుండా చూసుకోవాలని టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ అన్నాడు కూడా. కాబట్టి టీమ్ ఇండియా ప్రతీ అడుగూ జాగ్రత్త వేయాలి ప్రపంచకప్‌ను అందుకోవాలంటే.

నిజానికి టీమ్ ఇండియాలో ప్లేయర్లు అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. దానికి తోడు ఐపీఎల్‌ (IPL) లో మంచి ప్రాక్టీస్ కూడా వచ్చింది. బంగ్లాదేశ్ వామప్ మ్యాచ్‌తో టీమిండియాకు మంచి ప్రాక్టీస్ దక్కింది. రోహిత్, విరాట్‌లు ఓపెనింగ్‌కు దిగితే సంజూ శాంసన్ వన్‌డౌన్‌లో దిగుతాడు. తర్వాతి రెండు స్థానాల్లో సూర్యకుమార్, శివమ్ దూబే, హార్దిక్‌ పాండ్యాలు ఆడనున్నారు. స్పిన్ పిచ్ కాబట్టి రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఆడనున్నారు. పేస్ కోటాలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మొహ్మద్ సిరాజ్‌ ఆడనున్నారు. పిచ్‌ స్పిన్‌కు ఎక్కువ అనుకూలం అనుకుంటే.. సిరాజ్‌ స్థానంలో యుజ్వేంద్ర చహల్‌ ఆడే అవకాశముంది. నిజానికి టీమ్ ఇండియా అన్ని రకాలుగా పటిష్టంగా ఉంది కాబట్టి విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ అదే ఓవర్ కాన్ఫిడెన్స్‌గా మారితే మాత్రం దెబ్బ తగులుతుంది. కాబట్టి రోహిత్ సేన జాగ్రత్తగా ఆడాలి.

Also Read : ఏపీ ఎన్నికల్లో భారీ మెజార్టీల వీరులు వీరే!

Advertisment
తాజా కథనాలు