Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ రెండు రోజులుగా విచారణ చేస్తోంది. కోర్టు ఏడు రోజు లకస్టడీ ఇచ్చిన అనంతరం విచారణ మొదలుపెట్టింది.ఈరోజు ఆమెతో పాటూ కవిత భర్త అనిల్‌ను కూడా ఈడీ విచారించనుంది. నిన్న విచారణ తర్వాత కవిత మరోసారి తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇన్న భర్త అనిల్, అన్న కేటీఆర్, న్యాయవాదిలను ములాకత్ అయిన తర్వాత ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.సుప్రీంకోర్టులో ఆమె రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ... కేసులో తన ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు లేవని కవిత అందులో పేర్కొన్నారు. పిటిషన్‌లో ప్రతివాదిగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌ను చేర్చారు. రేపు ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో రూ. 100 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఈడీ కవితను ప్రశ్నిస్తున్నారు. బుచ్చిబాబు, మాగంటి చాట్‌లలో కనిపించిన 33 శాతం గురించి కూడా ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించే నేడు కవిత భర్త అనిల్, వ్యక్తిగత సిబ్బందిని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. నిన్న ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కవితను విచారించారు. ఈరోజు కూడా పూర్తి రోజంతా విచారణ జరగనుందని అధికారులు చెబుతున్నారు. లిక్కర్ స్కాం కేసులో కవిత పాత్రకు సంబంధించి ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిళ్లై, ఆడిటర్ బుచ్చిబాబు, మాగుంట రాఘవ, శరత్ చంద్ర రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. వాంగ్మూలంలో ఉన్న సమాచారాన్ని కవిత ద్వారా ధ్రువీకరించాలని ఈడీ ప్రయత్నిస్తోంది.