Cabinet Meeting: ప్రధాని మోదీ నివాసంలో నేడు కేబినేట్ మీటింగ్..

ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర కేబినేట్‌ భేటి జరగనుంది. ఈ సమావేశానికి ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రులుగా పదవి చేపట్టనున్నవారు హాజరుకానున్నారు.

Cabinet Meeting: ప్రధాని మోదీ నివాసంలో నేడు కేబినేట్ మీటింగ్..
New Update

PM Modi Cabinet Meeting: ఈరోజు కేంద్ర కేబినేట్ సమావేశం జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ నివాసంలో ఈ భేటి జరగనుంది. ఈ సమావేశానికి  మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారు హాజరుకానున్నారు. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేదానిపై ఆసక్తి నెలకొంది. అయితే నరేంద్రమోదీ మూడోసారి ప్రధానిగా ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారం స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 71 మంది ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read: మోదీ మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కులు వీళ్లే..

ప్రధాని మోదీతో కలిపి 30 మంది కేబినేట్‌ మంత్రులు, 5 గురు సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా), 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 5 గురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్లలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్‌ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ), పెమ్మసాని చంద్రశేఖర్‌ (టీడీపీ), శ్రీనివాస వర్మ(బీజేపీ) ఉన్నారు.

#cabinet-meeting #telugu-news #pm-modi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి