Children Stomach Ache: చిన్నారుల కడుపు నొప్పి పోగొట్టే చిట్కాలు..మందులు అస్సలు వాడొద్దు

సాధారణంగా చిన్న పిల్లల్లో కడుపు నొప్పి వస్తుంది. దీనిని తగ్గించేందుకు మెడిసిన్‌ ఇవ్వడంతో పాటు కొన్ని ఇంటి చిట్కాలు పాటించవచ్చు. వాము, పుదీనా,అల్లం, తేనె, త్రిఫల, సోంపు లాంటి కొన్ని ఇంటి చిట్కాలతో ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు.

New Update
Children Stomach Ache: చిన్నారుల కడుపు నొప్పి పోగొట్టే చిట్కాలు..మందులు అస్సలు వాడొద్దు

Children Stomach Ache: కడుపు నొప్పి రావడం పిల్లల్లో కామన్‌గా వస్తుంది. ఆయుర్వేదం నిపుణులు ప్రకారం.. పిల్లల కడుపు నొప్పిని ఇంటి చిట్కాలతో కూడా తగ్గించుకోవచ్చు అంటున్నారు. కడుపు సమస్యలు, నొప్పిని తగ్గించడంలో ఇవి బాగా పని చేస్తాయి. అసలు కడుపు నొప్పి రావడానికి కారణం ఎక్కవుగా తినడం, జీర్ణక్రియ మందగించడం, ప్రేగు కదలికల్లో ఇబ్బంది, గ్యాస్ట్రిక్, ఇన్ఫెక్సన్, కొంత అలర్జీల వంటి సమస్యలు ఉంటే కడుపు నొప్పి వస్తుంది. దీని వల్ల పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే కొన్ని ఇంటి టిప్స్‌తో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పిల్లల ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్:
వాము: కడుపునొప్పిని తగ్గించడంలో వాము బెస్ట్‌ ఐటమ్‌. కొద్దిగా వాముని నీటిలో వేసి మరిగించి చల్లారి తరువాత తాగిలి. ఇలా చేస్తే కడుపు సమస్యల్ని తగ్గి కడుపు నొప్పి నుంచి ఈ నీరు రిలాక్స్ చేస్తుంది.
పుదీనా: పుదీనా ఆకులు కూడా కడుపులో ఇబ్బందిని దూరం చేస్తుంది. కొద్దిగా పుదీనా ఆకులని ఓ గ్లాసు వేడి నీటిలో కలిపి తాగాలి. ఇలా చేస్తే కడుపు నొప్పి నుంచి రిలాక్స్ అవుతారు.
అల్లం, తేనె: జీర్ణక్రియ లక్షణాలని మెరుపరచటంలో అల్లం బాగా పని చేస్తుంది. అల్లం రసం, తేనె కలిపి పిల్లలకు తాగించాలి. దీంతో జీర్ణక్రియకి పెరుగు పడి కడుపు నొప్పి తగ్గుతుంది.
ఇంగువ: ఇంగువలో ఉండే యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు కడుపు తిమ్మరి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ కలిపి పిల్లల పొట్టకి రాస్తే కడుపు నొప్పి తగ్గుతుంది.
త్రిఫల: జీర్ణ సమస్యల్ని తగ్గించడంలో త్రిఫల బాగా పనిచేస్తుంది. దీనివల్ల కడుపు నొప్పి తగ్గుతుంది. కానీ.. దీనిని వాడేటప్పుడు డాక్టర్‌, ఆయుర్వేద నిపుణులని సంప్రదిస్తే మంచిది.
సోంపు: కడుపు నొప్పి తగ్గించడంలో సోంపు మంచిగా పని చేస్తుంది.  చెంచా సోంపు గింజల్ని వేయించి తేలిగ్గా గ్రైండ్ చేసి పొడిలా చేసి గోరువెచ్చని నీటిలో వేసి పిల్లల చేత తాగించాలి.

ఇది కూడా చదవండి: బరువు తగ్గించే ఆకు కూరలు ఇవే..షుగర్ కూడా తగ్గుతుంది

వీటితో పాటు కొన్ని అలవాట్లు పాటించాలి. సమయానికి పిల్లలకి సరైన ఫుడ్‌ పెట్టాలి. అంతేకాకుండా తాజాగా వండిన ఫుడ్స్‌, ఎక్కువ నీరు తాగేలా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నా కడుపు నొప్పి తగ్గకపోతే జ్వరం, వాంతులు, ఇతర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యని పరిష్కరించేందుకు ముందుకు పిల్లల డాక్టర్‌ వద్దకు తీసుకేళ్లాలి. ఏవైనా జాగ్రత్తలు తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకుంటే మంచిది.
గమనిక: అవగాహాన కోసం ఈ సమాచారం ఇస్తున్నాం. ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్లను సంప్రదించడమే మంచిది.

Advertisment
తాజా కథనాలు